ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ముస్లింల సంక్షేమానికి ప్రధాని మోదీ కృషి: భాజపా

By

Published : Oct 27, 2020, 3:29 PM IST

ప్రధాని మోదీ ముస్లింల సంక్షేమం కోసం కృషి చేస్తున్నారన్నారు భారతీయ జనతా మైనార్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు షేక్ బాజీ. ఉగ్రవాద భావజాలాలున్న కొన్ని సంస్థల పట్ల ముస్లిం మైనారిటీలు అప్రమత్తంగా ఉండాలని నెల్లూరులో ఆయన కోరారు.

Be vigilant against organizations with terrorist sentiments
ఉగ్రవాద భావాలున్న సంస్థల పట్ల అప్రమత్తంగా ఉండాలి

ముస్లిం మైనార్టీల సంక్షేమం కోసం ప్రధాని నరేంద్ర మోదీ కృషి చేస్తున్నారని భారతీయ జనతా మైనార్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు షేక్ బాజీ వెల్లడించారు. దేశంలోని ప్రజలందరనీ సమాన భావంతో చూస్తూ, వారి అభ్యున్నతికి కృషి చేస్తున్నారని నెల్లూరులో చెప్పారు.

త్రిపుల్ తలాక్ రద్దుతోపాటు మైనార్టీల కోసం అనేక సంక్షేమ పథకాలను కేంద్రం అమలు చేస్తోందన్నారు. కుటుంబ పాలన ఉన్న కొన్ని రాష్ట్రాల్లో ముస్లింలను ఓటు బ్యాంకుగానే వాడుకుంటున్నారని విమర్శించారు. ఉగ్రవాద భావజాలాలున్న కొన్ని సంస్థల పట్ల ముస్లిం మైనారిటీ లు అప్రమత్తంగా ఉండాలని కోరారు.

ABOUT THE AUTHOR

...view details