ఆంధ్రప్రదేశ్

andhra pradesh

సామాజిక కార్యక్రమాల్లో ఆత్మకూరు పోలీసులు

By

Published : Jul 14, 2020, 5:33 PM IST

నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలో పోలీసులు సామాజిక కార్యక్రమాలతో ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. కరోనా విస్తరిస్తున్న వేళ మాస్క్ ధరించకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని తెలియజేస్తున్నారు.

nellore  district
సామాజిక కార్యక్రమాలు చేపట్టిన ఆత్మకూరు పోలీసులు..

నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలో పోలీసులు కరోనా పై అవగాహన కార్యక్రమం చేపట్టారు. ఆత్మకూరు ఎస్సై సంతోష్ కుమార్ రెడ్డి సోమశిల రోడ్ సెంటర్లో వాహన తనిఖీలు నిర్వహించారు. మాస్క్ లేకుండా తిరిగే వారిపై కేసులు నమోదు చేశారు. ప్రజలు ప్రభుత్వ నిబంధనలను అనుసరించి వ్యవహరించాలని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.

ఆపరేషన్ ముస్కాన్...

ఆత్మకూరు పట్టణంలో బాలకార్మికులను, వీధుల్లో తిరిగే అనాథ పిల్లలను గుర్తించేందుకు ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు పోలీసులు ప్రారంభించారు. నేటి నుంచి ఈ నెల 22వ తేదీ వరకు ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్టు ఆత్మకూరు ఎస్సై సంతోష్ కుమార్ రెడ్డి తెలిపారు. పోలీసుల ప్రత్యేక బృందం పట్టణంలో తిరుగుతూ అన్ని దుకాణాలోలో ఉండే వర్కర్స్ వివరాలు తెలుసుకుంటోంది. మైనర్లను, బాల కార్మికులను గుర్తించి వారి తల్లిదండ్రులకు అప్పగించటం.. అనాథ పిల్లలను గుర్తించి ప్రభుత్వం అనాధాశ్రమంలకు తరలించే ఉద్దేశ్యమే ఈ ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమం అమలు అని తెలిపారు.

ఇదీ చదవండి:

నెల్లూరు ప్రభుత్వ ఆస్పత్రి ఎదుట నర్సింగ్ సిబ్బంది ఆందోళన

ABOUT THE AUTHOR

...view details