ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Ganja Gang: అంతర్రాష్ట్ర గంజాయి సరఫరా ముఠా అరెస్ట్.. తెలంగాణ నుంచి రాష్ట్రంలోకి

By

Published : Apr 21, 2023, 3:19 PM IST

Ganja Supply Gang Arrested: నెల్లూరు - ప్రకాశం జిల్లాల సరిహద్దు ప్రాంతాలలో యథేచ్చగా గంజాయి విక్రయాలు జరుగుతున్నాయి. తెలంగాణ నుంచి రాష్ట్రానికి ప్రత్యేక ప్యాకెట్లలో సరఫరా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. మొత్తం 11 మంది అంతర్రాష్ట్ర గంజాయి సరఫరా ముఠాను అరెస్టు చేసి.. వీరి వద్ద నుంచి భారీ మొత్తంలో గంజాయి స్వాధీనం చేసుకున్నారు.

Ganja Supply Gang Arrested
గంజాయి సరఫరా ముఠా అరెస్ట్

Ganja Supply Gang Arrested: నెల్లూరు జిల్లాలోకి తెలంగాణా రాష్ట్రం నుంచి తరచూ గంజాయి అక్రమంగా వస్తోంది. నెల్లూరు, ప్రకాశం జిల్లా సరిహద్దు ప్రాంతాలలోకి అక్రమంగా తీసుకువచ్చి భారీగా విక్రయాలు చేస్తున్నారు. పోలీసులు వారిపై దాడులు చేసి.. వాహనాల్లో తరలిస్తున్న గంజాయి ప్యాకెట్లను పట్టుకుంటున్నారు. సెబ్ అధికారులు ప్రకాశం -నెల్లూరు, నెల్లూరు - చెన్నై సరిహద్దులో ప్రత్యేక బృందాలు ద్వారా నిఘా పెడుతున్నారు.

ఇటీవల కాలంలో పదిసార్లకు పైగా దాడులు చేసి అరెస్ట్​లు చేశారు. తెలంగాణ నుంచి ఆంధ్రాలోకి పంపిస్తున్న గంజాయి వ్యాపారులను మాత్రం గుర్తించడం లేదు. అదేవిధంగా నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో ఎవరికి సరఫరా చేస్తున్నారనే విషయాలను కూడా గుర్తించలేకపోతున్నారు. గంజాయి అక్రమ రవాణాను అరికట్టేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని నెల్లూరు ఎస్పీ తిరుమలేశ్వర్ రెడ్డి తెలిపారు. అందులో భాగంగా సివిల్ పోలీసులతో పాటు సెబ్ అధికారులు కలిసి పని చేస్తున్నారని అన్నారు.

సీసీ కెమెరాలు, ప్రత్యేక నిఘా బృందాలతో కలసి.. 15 లక్షలు విలువైన 52 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. 11 మంది ముద్దాయిలను అరెస్ట్ చేశారు. ఖమ్మం జిల్లా నుంచి నెల్లూరుకి గంజాయిని తీసుకువస్తుండగా పట్టుకున్నారు. పట్టుబడ్డ వారందరూ.. ఇతర రాష్ట్రాలకు గంజాయిని వివిధ పద్ధతుల్లో తరలించి విక్రయిస్తున్నారని తేలింది. వీరి నుంచి 10 మొబైల్స్, మారుతి స్విఫ్ట్ కార్​ను స్వాధీనం చేసుకున్నారు. ఇందులో నలుగురు గంజాయి వినియోగదారులు ఉన్నారు.

జిల్లావ్యాప్తంగా విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. గంజాయి తాగినా, అమ్మినా, రవాణా చేసినా, సాగు చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. నెల్లూరు నగరంతో పాటు, జిల్లాలోని పలు ప్రాంతాల్లో గంజాయి విక్రయిస్తున్న పాయింట్లను తొందరలోనే గుర్తిస్తామని తెలిపారు. సెబ్ జిల్లా అధికారి హిమవతి పర్యవేక్షణలో తనిఖీలు చేస్తామని చెప్పారు.

Ganja Gang: అంతర్రాష్ట్ర గంజాయి సరఫరా ముఠా అరెస్ట్

"మొత్తం 11 మందిని అరెస్ట్ చేసి.. 52 కేజీలను పట్టుకోవడం జరిగింది. ఇందులో వినియోగదారులు ఉన్నారు. అమ్మేవాళ్లు ఉన్నారు. అదే విధంగా ఇక్కడకి సప్లై చేసే వాళ్లు కూడా ఉన్నారు. వీరి దగ్గర నుంచి ఒక కారు, సెల్​ఫోన్లు సీజ్ చేయడం జరిగింది. కొంత గంజాయిని ఇతరులకు అమ్మారు.. వారిని కూడా పట్టుకున్నాం. 11 మందిలో.. నలుగురు వినియోగదారులు ఉన్నారు. ఎక్కువ మొత్తంలో కొనుక్కున్నారు వాళ్లు. ఎంత మొత్తంలో కొనుక్కున్నా సరే.. గంజాయి వాడటం చట్ట ప్రకారం నేరం. వారిపైన కఠిన చర్యలు తీసుకుంటాం. వారిపైన పర్యవేక్షణ కూడా ఉంటుంది. కొంచమే కదా మేము వాడినాము అంటే లేదు.. కొంచం అయినా సరే నేరమే. ఇప్పుడు పట్టుకొని వచ్చిన వారిలో స్టూడెంట్స్ ఎవరూ లేరు. పిల్లలు ఏం చేస్తున్నారో అనే దానిపైన నిఘా పెట్టాలని తల్లిదండ్రులకు చెప్తున్నాం". - తిరుమలేశ్వరరెడ్డి, ఎస్పీ

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details