ఆంధ్రప్రదేశ్

andhra pradesh

"ఉపాధ్యాయులు లేరు మామా".. పల్నాడులో నిరసన వ్యక్తం చేసిన విద్యార్థులు

By

Published : Nov 28, 2022, 1:01 PM IST

Updated : Nov 28, 2022, 1:14 PM IST

STUDENTS PROTEST AT PALNADU
STUDENTS PROTEST AT PALNADU

STUDENTS PROTEST: పాఠశాలలో సరిపడా ఉపాధ్యాయులు ఉండి బోధన సరిగ్గా ఉంటే విద్యార్థుల భవితవ్యం బాగుంటుంది. అలా కాకుండా తక్కువ మంది ఉపాధ్యాయులు ఉంటే.. అదీ పదో తరగతి విద్యార్థులకైతే ఆ సంగతి చెప్పక్కర్లేదు. ఒక వైపు పరీక్షల సమయం.. మరోవైపు టీచర్ల కొరత. ఏం చేయాలో తెలియని స్థితిలో ఉన్న ఆ విద్యార్థులు నిరసన చేపట్టారు. ఉపాధ్యాయులు లేరు​ మామా అంటూ ఆందోళన చేపట్టారు. ఇంతకీ ఇది ఎక్కడ జరిగిందంటే??

STUDENTS PROTEST AT PALNADU : ఉపాధ్యాయులు లేరు మామా అంటూ.. పల్నాడు జిల్లా గురజాల మండలం మాడుగులలోని.. జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల విద్యార్థులు రోడ్డెక్కారు. అదివారం గురజాలలోని మాచర్ల రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. పదో తరగతి చదువుతున్న 18 మందితోపాటు.. మిగిలిన విద్యార్థులు కొందరు వారికి మద్దతు తెెలిపారు. ఇద్దరు ఉపాధ్యాయులే పదో తరగతి బోధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా అయితే ఎలా చదువుకోవాలంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన తెలిపారు.

తరగతులు సరిగా సాగడం లేదని.. పరీక్షలు ఎలా రాయాలని ప్రశ్నించారు. పాఠశాలలో ఎన్నిసార్లు విన్నవించుకున్న ప్రయోజనం లేకపోవడంతో.. నిరసన చేపట్టినట్లు తెలిపారు. పోలీసులు.. విద్యార్థులను తహసీల్దారు వద్దకు తీసుకెళ్లారు. వారంలోగా ఉపాధ్యాయులు వచ్చేలా చూస్తామని ఆయన విద్యార్థులకు హామీ ఇచ్చారు.

"ఉపాధ్యాయులు లేరు మామా".. పల్నాడులో విద్యార్థుల ధర్నా

ఇవీ చదవండి:

Last Updated :Nov 28, 2022, 1:14 PM IST

ABOUT THE AUTHOR

...view details