ఆంధ్రప్రదేశ్

andhra pradesh

లోకేశ్‌ పర్యటనలో పాల్గొంటే చర్యలు.. నేతలకు పోలీసు నోటీసులు!

By

Published : Jun 23, 2022, 8:57 AM IST

TENSION AT LOKESH TOUR
పల్నాడులో టెన్షన్ వాతావరణం ()

TENSION AT LOKESH TOUR: నారా లోకేశ్ చేపట్టిన పల్నాడు పర్యటనలో టెన్షన్ వాతావరణం నెలకొంది. లోకేశ్‌ పర్యటనలో పాల్గొనవద్దంటూ తెదేపా నేతలకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. జిల్లాలో ముఖ్యనేతలందరికీ నోటీసులు ఇచ్చారు. లోకేశ్‌ పర్యటనలో పాల్గొంటే ప్రాణనష్టం జరిగే సమాచారం ఉందంటూ నోటీసులో పేర్కొన్నారు.

TENSION AT LOKESH TOUR: తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన పల్నాడు పర్యటనలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఈ పర్యటనలో పాల్గొంటే ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉందనే సమాచారం తమ వద్ద ఉందంటూ.. పోలీసులు నోటీసులు జారీ చేయడం వివాదాస్పదమవుతోంది. జిల్లాలోని తెలుగుదేశం ముఖ్యనేతలందరికీ ఈ మేరకు నోటీసులు జారీ చేశారు. ఈ పర్యటనలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తి.. అల్లర్లు జరుగుతాయని అందులో పేర్కొన్నారు. అనుమతి లేని కార్యక్రమంలో పాల్గొని విధ్వంసకర ఘటనలకు బాధ్యులు కావొద్దంటూ హెచ్చరికలు జారీచేశారు. నోటీసులు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. లోకేశ్ పర్యటనలో ఎట్టి పరిస్థితుల్లోనూ పాల్గొని తీరుతామని తెలుగుదేశం శ్రేణులు తేల్చి చెప్తున్నారు.

పల్నాడులో టెన్షన్ వాతావరణం

గతంలోనూ జల్లయ్య అంత్యక్రియలకు వెళ్లకుండా తెదేపా నేతలను పోలీసులు అడ్డుకున్నారు. ప్రాణనష్టం, అల్లర్లు, ఉద్రిక్త పరిస్థితులు, శాంతి భద్రతల విఘాతం, విధ్వంసకర పరిస్థితులు వంటి పదాలను పోలీసులు నోటీసుల్లో వాడటాన్ని తెలుగుదేశం నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. హత్యలు చేసేవారిని రోడ్లపైకి వదులుతూ, చనిపోయిన వారి కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు వెళ్తున వారికి ఈ ఆంక్షలేంటని మండిపడుతున్నారు.

పల్నాడు జిల్లాలో ఇటీవల హత్యకు గురైన తెలుగుదేశం నాయకుడు జల్లయ్య కుటుంబాన్ని తెదేపా జాతీయ ప్రధానకార్యదర్శి లోకేశ్​ పరామర్శించనున్నారు. రావులాపురం గ్రామంలో జల్లయ్య కుటుంబం ఉంటున్న ఇంటికి వెళ్లి..వారికి 25లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని లోకేశ్‌ అందచేయనున్నారు. ఈ ఉదయం 11 గంటలకు పిడుగురాళ్ల, కారంపూడి మీదుగా రావులాపురం గ్రామానికి లోకేశ్‌ వెళ్తారు. జల్లయ్య పెద్దకర్మ కార్యక్రమంలో పాల్గొంటారు. పల్నాడు జిల్లాలో లోకేశ్‌ పర్యటన సందర్భంగా..గురజాల నియోజకవర్గం తెలుగుదేశం నాయకులు పెద్ద ఎత్తున స్వాగత ఏర్పాట్లు చేశారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details