ఆంధ్రప్రదేశ్

andhra pradesh

CROP: 'అసని' తుపాన్​ ప్రభావం.. ధాన్యం రైతుల 'దిగాలు'

By

Published : May 17, 2022, 8:34 AM IST

CROP: 'అసని' తుపాన్​ పల్నాడు జిల్లాలోని రైతుల ఆశలపై నీళ్లు చల్లింది. చేతికొచ్చిన పంట చేజారిపోయింది. నేలతల్లిని నమ్ముకున్న రైతుకు అసని ​గుండెకోతను మిగిల్చింది. పంట చేతికొచ్చిందని ఆనందించే లోపు నేనున్నానంటూ వచ్చి బీభత్సం సృష్టించింది. కోతలు కోసి పొలంలో ఉన్న ధాన్యం వర్షానికి తడిసిపోయింది. ధాన్యం అమ్మే దారిలేక రైతులు అవస్థలు పడుతున్నారు. ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు అధికారులు రాకపోగా... బయట అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

CROP
'అసని' తుపాన్​ ప్రభావం.. ధాన్యం రైతుల 'దిగాలు'

CROP: అసని తుపాను పల్నాడు జిల్లా రైతుల ఆశలపై నీళ్లు చల్లింది. వర్షాలకు ధాన్యం పూర్తిగా తడిసిపోయి... రంగు మారడంతోపాటు మొలకలెత్తింది. ఈ పరిస్థితుల్లో అమ్ముకునే దారిలేక రైతులు అవస్థలు పడుతున్నారు. అధికారులు వచ్చి చూసిపోతున్నారే తప్ప.... కొనుగోలు చేసేందుకు ముందుకు రావడం లేదని రైతులు వాపోతున్నారు.

'అసని' తుపాన్​ ప్రభావం.. ధాన్యం రైతుల 'దిగాలు'


ఆరుగాలం శ్రమించి పండించిన పంట వానార్పణమైంది. అసని తపాను రైతులను నిండా ముంచింది. పల్నాడు జిల్లాలో రాశుల కిందికి వాన నీరు చేరి... చాలావరకు ధాన్యం మొలకెత్తింది. మరికొన్ని చోట్ల రంగు మారడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. తడిసిన ధాన్యం ఆరబెట్టిన తర్వాత అమ్ముకుందామంటే... నాణ్యత లేదంటూ ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో తీసుకోవడం లేదు. ప్రైవేట్ వ్యాపారులు కనీసం కన్నెత్తి చూడటం లేదు. ధాన్యం అమ్ముకునే మార్గం కనిపించక... తక్కువ ధరకే విక్రయించుకోవాల్సి వస్తోందని రైతులు ఆవేదన చెందుతున్నారు.


రైతుభరోసా కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు చేస్తామని గొప్పగా చెప్పిన ప్రభుత్వం....రబీ సీజన్‌లో ఎక్కువగా పండించే 1010 రకం తీసుకోవడం లేదు. పల్నాడు జిల్లాలో ధాన్యం సేకరణ లక్ష్యం 95వేల టన్నుల కాగా.... ఇప్పటి వరకు కనీసం 15వేల టన్నులు కూడా కొనలేదు. ప్రభుత్వ కనీస మద్దతు ధర 14 వందలకు పైగా ఉండగా.... కొనుగోళ్లకు ముందుకు రాకపోవడంతో దళారులకు 11వందలకే విక్రయిస్తున్నట్లు రైతులు చెబుతున్నారు. తుపాను నేపథ్యంలో వారం రోజుల నుంచి ప్రైవేటు వ్యాపారులు సైతం కొనుగోళ్లను నిలిపేశారు. గతంలో తెలంగాణ నుంచి వ్యాపారులు వచ్చి ధాన్యం కొనుగోలు చేయడంతో డిమాండ్ ఏర్పడి రైతుకు మంచి ధర దక్కేది. సరిహద్దుల వద్ద లారీలు నిలిపివేయడంతో ఇప్పుడా అవకాశం లేకుండా పోయింది. స్థానికంగా వ్యాపారులు కొనుగోళ్లు నిలిపివేయడంతో... రైతుల వద్ద ధాన్యం నిల్వలు పేరుకుపోయాయి. తడిసిన ధాన్యం ఆరబెట్టడానికి అదనపు ఖర్చవుతోందని రైతులు వాపోతున్నారు. ప్రభుత్వం స్పందించి తడిసిన ధాన్యం కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు.

ఇవీ చదవండి: 'ఏపీలో ఫోన్​ ట్యాపింగ్​పై దర్యాప్తు జరపండి'.. అమిత్‌షాకు తెదేపా ఎంపీల లేఖ

ABOUT THE AUTHOR

...view details