ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ కార్యక్రమానికి ముహూర్తం ఖరారు.. మంత్రి విడదల రజిని

By

Published : Apr 1, 2023, 5:59 PM IST

AP Minister Vidadala Rajini COMMENTS: రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ ప్రారంభానికి ముహూర్తం ఖరారు అయిందని .. ఆరోగ్యశాఖ మంత్రి రజని వెల్లడించారు. ఈ నెల 6న పల్నాడు జిల్లాలో సీఎం జగన్‌ ప్రారంభించనున్నట్లు ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమ ఏర్పాట్లను మంత్రి, అధికారులు పరిశీలించారు.

Vidadala Rajini
Vidadala Rajini

AP Minister Vidadala Rajini COMMENTS: ముఖ్యమంత్రి జగన్‌ మోహన్ రెడ్డి ఈ నెల 6వ తేదీన పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం లింగంగుంట్ల గ్రామంలో పర్యటించనున్నారని.. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ విధానాన్ని' సీఎం జగన్‌ ప్రారంభించనున్నారని ఆమె పేర్కొన్నారు. సీఎం జగన్ 6వ తేదీన లింగంగుంట్ల గ్రామానికి విచ్చేస్తుండడంతో నేడు వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ కృష్ణబాబు, ఎమ్మెల్సీలు తలసిరి రఘురాం, అప్పిరెడ్డి, ఏపీ హెచ్ఎంఐడీసీ ఎండీ మురళీధర్ రెడ్డి, కలెక్టర్ శివశంకర్, ఎస్పీ రవిశంకర్ రెడ్డి, జెసీ శ్యాం ప్రసాదులతో కలిసి ఆమె ఏర్పాట్లను పరిశీలించారు.

ఈ సందర్భంగా మంత్రి విడదల రజిని మీడియాతో మాట్టాడుతూ.. ఇంటింటికి వైద్యం అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించబోతున్నా ఫ్యామిలీ డాక్టర్ విధాన కార్యక్రమం దేశంలోనే ఆదర్శంగా నిలువబోతుంది. గత ఏడాది అక్టోబర్ 21 నుంచి ఈ ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ కార్యక్రమం ట్రయల్ రన్ విజయవంతంగా నడుస్తుంది. ప్రతి సచివాలయ పరిధిలోని రెండువేల జనాభాకు ఏర్పాటు చేసిన.. డాక్టర్ వైయస్సార్ విలేజ్ క్లినిక్ వద్దకు 104 వాహనంలో మండలంలో ఉన్న పీహెచ్సీ వైద్యులలో ఒకరు ప్రతి 15 రోజులకు ఒకసారి వస్తారు. గ్రామంలో అవసరమైన అందరికీ వైద్య పరీక్షలతో పాటు మందులను కూడా ఉచితంగా అందజేస్తారు. దీంతోపాటు గ్రామంలో ఉన్న అంగన్వాడీ, పాఠశాలల్లో విద్యార్థులను కూడా డాక్టర్ వెళ్లి స్వయంగా పరీక్షించి, అవసరమైన వారికి వైద్య సేవలు అందిస్తారు. ఈ కార్యక్రమం దేశంలోనే ఒక ఐకానిక్‌గా నిలుస్తుంది.'' అని ఆమె వ్యాఖ్యానించారు.

అనంతరం ఈ నెల 6వ తేదిన పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం లింగంగుంట్ల గ్రామంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి 'ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ విధానాన్ని' ప్రారంభించానున్నారని ఆమె తెలిపారు. చిలకలూరిపేట నియోజకవర్గానికి విచ్చేస్తున్న సీఎం జగన్మోహన్ రెడ్డికి ప్రజలందరూ ఘనంగా స్వాగతం పలికి, కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆమె కోరారు. 6వ తేదీన జరగబోయే కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, జిల్లా అధికారులు, స్థానిక అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొంటారని వివరించారు.

ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తలపెట్టనున్న ఫ్యామిలీ డాక్టర్ పోగ్రామ్ ఖచ్చితంగా దేశానికి ఆదర్శవంతంగా నిలువబోతుంది. ఇంతంటి ప్రతిష్టాత్మకమైన పోగ్రాము మన పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం లింగంగుంట్ల గ్రామంలో ఈ నెల 6వ తేదీన సీఎం జగన్ ప్రారంభించబోతున్నారు. కాబట్టి చిలకలూరిపేట నియోజకవర్గ ప్రజలందరూ సీఎం జగన్ మోహన్ రెడ్డికి ఘనంగా స్వాగతం పలికి, కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతున్నాను.- విడదల రజిని, వైద్యాశాఖ మంత్రి.

ఈ నెల 6న ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ విధానం ప్రారంభం..

ఇవీ చదవండి

ABOUT THE AUTHOR

...view details