ఆంధ్రప్రదేశ్

andhra pradesh

అభ్యర్థులనే కాదు జగన్​ను మార్చినా వైసీపీ గెలుపు అసాధ్యం: టీడీపీ

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 12, 2023, 6:09 PM IST

TDP Leaders Reaction on YCP New Incharges :  ఈసారి ఎన్నికల్లో వైసీపీ ఓటమి ఖాయమని టీడీపీ నేతలు అన్నారు. అది గ్రహించే పలుచోట్ల ఆ పార్టీ ఇన్​ఛార్జ్​లను మార్చిందని ఆరోపిస్తున్నారు. అయితే అభ్యర్థులనే కాదు పార్టీ అధ్యక్షుడిగా జగన్​ను మార్చినా ఆ పార్టీ గెలుపు అసాధ్యమని తెలుగుదేశం నేతలు స్పష్టం చేస్తున్నారు. తెలంగాణలో మొదలైన మార్పును చూసి జగన్​ జాగ్రత్ర పడాలనుకుంటున్నా ఈ ప్రభుత్వానికి బుల్లెట్ ఎప్పుడో దిగిందని ఇంకా వారికి తెలియడం లేదని ఎద్దేవా చేశారు.

Appointment_of_new_Incharges_in_YCP
Appointment_of_new_Incharges_in_YCP

TDP Leaders Reaction on YCP New Incharges : అధికార వైసీపీ 11 నియోజకవర్గాల్లో కొత్త ఇన్​ఛార్జ్​లను నియమించింది. మార్చిన స్థానాల్లో అభ్యర్థులు గెలవరని కాదని, కొత్త స్థానాల్లో ఖచ్చితంగా గెలుస్తారని మార్చినట్లు వైసీపీ పెద్దలు చెబుతున్నారు. అయితే నియోజకవర్గాలకు కొత్త ఇన్​ఛార్జ్​లను నియమించినా వైసీపీ గెలుపు అసాధ్యమని టీడీపీ నేతలు స్పష్టం చేస్తున్నారు. అసెంబ్లీ అభ్యర్థులను కాదు కదా స్వయంగా ఆ పార్టీ అధ్యక్షుడిని మార్చినా వైసీపీ గెలుపు అసాధ్యమని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు (TDP state president Atchannaidu) అచ్చెన్నాయుడు విమర్శించారు. ఈ ప్రభుత్వానికి ఇంకా మూడు నెలలే గడువు ఉందని తెలిపారు.

వైసీపీ ఇంచార్జ్​లు నియామకం - మార్పుల వెనుక డబ్బు-లాబీయింగ్‌ గట్టిగా పని చేసిందని ప్రచారం

Bonda Uma Criticized the YCP Party :ఎన్నికలకు మూడు నెలల ముందే వైసీపీ చేతులు ఎత్తేసిందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమ విమర్శించారు. ఐ ప్యాక్ సర్వేల్లో వైసీపీ సింగిల్ డిజిట్​కే పరిమితమని తేలిందన్నారు. ఒక నియోజకవర్గానికి చెల్లని కాసులు మరొక నియోజకవర్గానికి ఎలా పనికి వస్తారని ప్రశ్నించారు. వై నాట్ 175 అన్న పార్టీ, ఇప్పుడు జగన్ టికెట్ ఇస్తానన్నా నేతలు వద్దు అంటున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇస్తే క్యూలో నిలబడేందుకు ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. జనవరి ఒకటి నాటికి వైసీపీ దివాళా బోర్డు పెట్టడం ఖాయమని విమర్శించారు. కొంత మంది ఎమ్మెల్యేలు పోటీ చేయడానికి ఇష్టం లేక ఇతర రాష్ట్రాల్లో తలదాచుకుంటున్నారని ఎద్దేవా చేశారు.

వైఎస్సార్​సీపీ నూతన ఇన్​చార్జ్​లు నియామకం - నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని కార్యకర్తల హుకుం

TDP Leaders Respond on YCP new Incharges : జగన్​ని మార్చాలని ప్రజలు డిసైడ్ అయ్యాక ఎంత మంది ఇన్​చార్జ్​లను మార్చినా ఫలితం లేదని శాసనమండలి మాజీ చైర్మన్ షరీఫ్ విమర్శించారు. చివరికి అధ్యక్షుడిగా జగన్ తప్పుకొని తన కుటుంబ సభ్యులకు బాధ్యతలు ఇచ్చినా, వైసీపీ పార్టీని ఎవరూ కాపాడలేరన్నారు. ఈ ప్రభుత్వానికి బుల్లెట్ ఎప్పుడో దిగిందని ఇంకా వారికి తెలియడం లేదని ఆక్షేపించారు. తెలంగాణలో ఫలితాలు చూసి జాగ్రత్త పడాలని జగన్ అనుకుంటున్నాడు, కానీ ఇక్కడ ప్రజలు వైసీపీ ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపాలని నిర్ణయించుకున్నారని వెల్లడించారు.

ఆశలు రేపి మొండిచేయి చూపి, ఆర్కేకే వైసీపీలో ఈ దుస్థితి ఉంటే మిగిలిన వారి పరిస్థితేంటి?

నాలుగున్నర సంవత్సరాలుగా వైసీపీ చేసిన దుర్మార్గాలని ప్రజలు ఎవరూ మర్చిపోలేదని తెలిపారు. జగన్ తన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకొని ఆ తప్పులను సిట్టింగ్ ఎమ్మెల్యేల పై తోసి వాళ్లని బలి చేస్తున్నాడని మండిపడ్డారు. నాలుగున్నర ఏళ్లుగా బీసీలను అన్ని రకాలుగా హింసించినా జగన్ కసి చల్లారలేదని మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ధ్వజమెత్తారు. పీకే సర్వే ప్రకారం వైసీపీ చిత్తు చిత్తుగా ఓడిపోయే సీట్లని బీసీలకు కట్టబెట్టి జగన్ బీసీలను బలిపశువులను చెయ్యాలని చూస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Opposition Criticized to YCP Government :అలాగే వైసీపీ అధికారంలోకి వచ్చాక రెండుసార్లు మంత్రివర్గంలో అవకాశం వస్తుందని ఆశించి మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి భంగపడ్డారు. జగన్ కోసం చంద్రబాబుపై వ్యక్తిగతంగా కేసులు పెట్టి వేధించినా ఆయన ఆశ నెరవేరలేదు. ఇప్పుడు టికెట్టూ లేదంటూ మొదటికే మోసం రావడంతో మనస్థాపం చెందారు. చివరికి ఎమ్మెల్యే పదవికి, పార్టీకి రాజీనామా చేశారు. దీంతో జగన్ సొంత మనిషిలాంటి ఆర్కేనే పార్టీకి గుడ్ బై చెప్పడంతో ఇక పార్టీలో ఇతరుల నిష్క్రమణలకు గేట్లు తెరుచుకున్నట్లేననే ఇప్పటికే చర్చ మొదలైంది.

వైఎస్సార్సీపీలో వన్‌మ్యాన్‌ షో! అంతా అహం బ్రహ్మాస్మి, తెరపై దింపుడు కళ్లం ప్రయత్నాలు

11 సీట్లలో సమన్వయకర్తల మార్పు వెనక డబ్బు, లాబీయింగ్ గట్టిగా పని చేసిందని ప్రచారం సాగుతోంది. జిల్లాలను దాటించి మరీ ఇప్పుడు కొందరిని సమన్వయకర్తలుగా నియమించిన తీరే ఇందుకు నిదర్శనమని అంటున్నారు. 11 నియోజకవర్గాల సమన్వయకర్తల మార్పుతో ఆ పార్టీలో అసంతృప్తి భగ్గుమంది. పలుచోట్ల కొత్త ఇన్​ఛార్జ్​లకు వ్యతిరేకంగా వైసీపీ కార్యకర్తలు ఆందోళనలు చేపట్టారు.

ABOUT THE AUTHOR

...view details