ఆంధ్రప్రదేశ్

andhra pradesh

రాష్ట్రవ్యాప్తంగా ముందస్తు సంక్రాంతి సంబరాలు

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 12, 2024, 8:40 PM IST

ముత్యాల ముగ్గుళ్లు, భోగి మంటలు, గొబ్బిళ్లు, సంప్రదాయ వేషధారణలతో ముందస్తు సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. నిత్యం ఏకరూప దుస్తుల్లో కనిపించే వారంతా సంప్రదాయ దుస్తులు ధరించి ప్రాంగణాన్ని రంగవల్లులతో తీర్చిదిద్దారు. పొంగళ్లు, వివిధ వంటలు చేసి నోరూరించారు. భోగి మంటలు వేశారు. గాలి పటాలు ఎగురవేశారు.

sankranthi
sankranthi

Statewide Pre-Sankranti festival : రాష్ట్రంలో ముందుస్తు సంక్రాంతి పండగ సంబరాలు అంబరాన్నంటాయి. వివిధ ప్రాంతాల్లో కళాశాల విద్యార్థులు, మహిళలు చురగ్గా పాల్లొంటున్నారు. పండగకు రెండు రోజులు ముందే హోటళ్లు, షాపింగ్​ క్లాంప్లెక్స్​ విద్యుత్​ దీపాలతో, పూలతో ముస్తాబు అవుతున్నాయి. పండగ దృష్టిలో పెట్టుకొని వివిధ షాపు వాళ్లు ప్రత్యేక ఆపర్లు కస్టమర్లను ఆకట్టుకుంటున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా ముందస్తు సంక్రాంతి సంబరాలు

Pre Sankranti Celebrations in Vijayawada : విజయవాడలో ముందస్తు సంక్రాంతి వేడుకలు ఉత్సాహంగా సాగుతున్నాయి. కళాశాలలు, హోటళ్లు, వ్యాపార సంస్థల్లో ఈ వేడుకలను రెండు రోజులు ముందుగానే నిర్వహిస్తున్నారు. బందరు రోడ్డులోని ఫార్చ్యూన్‌ మురళీ హోటల్‌లో తెల్లవారుజామునే భోగి మంటలు వేసి సంప్రదాయ బద్ధంగా సంక్రాంతి వేడుకలను నిర్వహించారు. హరిదాసు కీర్తనలు, గంగిరెడ్లు, ధాన్యపు రాశులు కోడి పందాలు, గాలిపటాల కోలాహలం మధ్య తెలుగువారు పెద్ద పండుగ కళను పూర్తి గ్రామీణ వాతావరణంలో ఏర్పాటు చేశారు. హోటల్‌కు వచ్చే ఇతర రాష్ట్రాలు, విదేశీ పర్యాటకులకు పండుగ శోభను వారి కళ్లెదుట ఉంచేందుకు ఈ కార్యక్రమం నిర్వహించినట్లు జనరల్‌ మేనేజరు విజయకృష్ణ తెలిపారు. పండుగ వేళ సంప్రదాయ పిండి వంటలు సైతం తయారు చేయించి అందుబాటులో ఉంచారు.

ముందస్తు సంక్రాంతి - కళాశాలల్లో విద్యార్థుల సందడి చూడతరమా!

Pre Sankranti Celebrations in Anantapur : అనంతపురం జిల్లా గుంతకల్లులో మెప్మా ఆధ్వర్యంలో మున్సిపాలిటీ పరిధిలోని 28వ వార్డులో ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ పోటీలో పెద్ద సంఖ్యలో మహిళలు ఉత్సాహంగా పాల్గొని ముగ్గులు వేశారు. ముఖ్య అతిథులుగా పాల్గొన్న మున్సిపల్ కమిషనర్, ఛైర్మన్ దంపతులు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించి ముగ్గుల పోటీలో విజేతలను ఎంపిక చేసి బహుమతులను అందజేశారు. సంక్రాంతి వరకు రోజు ఒక్క వార్డులో ముగ్గుల పోటీలు నిర్వహించి విజేతలందరికీ పండుగ రోజున మెగా ముగ్గుల పోటీ నిర్వహించనున్నట్లు మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున తెలిపారు.

Pre Sankranti Celebrations in Kurnool : కర్నూలు నగరంలోని ఓ ఇంజనీరింగ్ కళాశాలో విద్యార్థులు తెలుగు సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా లంగా ఓణీలు ధరించి ముస్తాబయ్యారు. గుంటూరు జిల్లా దుగ్గిరాలలోని ప్రైవేటు ఇంజనీరింగ్‌ కాలేజీలో విద్యార్థులు, అధ్యాపకులు పండుగను పురస్కరించుకొని భోగిమంటలు వేశారు. సంక్రాంతి సంబరాలలో అధ్యాపకులు విద్యార్థులతో కలిసి డప్పు, కోలాటాల మధ్య ఆడుతూ ఉత్సాహంగా పాల్గొన్నారు.

ఏలూరులో సంక్రాంతి సంబరాలు - ముఖ్య అతిధిగా పొల్గొన్న అనంత శ్రీరామ్

Guntur Celebrations : గుంటూరు జిల్లా వడ్లమూడిలోని విజ్ఞాన్ వర్సిటీలో విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు, సంక్రాంతి పాటలతో అలరించారు. విద్యాసంస్థల సంస్థ ఛైర్మన్‌ లావు రత్తయ్య చిన్నారులపై భోగిపళ్లు వేసి ఆశీర్వదించారు.

గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికే పండుగ వాతావరణం నెలకొంది. వివిధ ప్రాంతాల్లో స్థిరపడిన వాళ్లు పండుగను సొంతూరిలో అయినవాళ్లతో జరుపుకునేందుకు బయల్దేరడంతో రహదారులు వాహనాలతో కిక్కిరిశాయి

ABOUT THE AUTHOR

...view details