ఏలూరులో సంక్రాంతి సంబరాలు - ముఖ్య అతిధిగా పొల్గొన్న అనంత శ్రీరామ్

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 11, 2024, 3:50 PM IST

thumbnail

Ananth Sriram In Eluru: సంస్కృతి సాంప్రదాయాలను పరిరక్షించవలసిన బాధ్యత సమాజంలో ప్రతి ఒక్కరిపై ఉందని ప్రముఖ సినీ గేయ రచయిత అనంత శ్రీరామ్ అన్నారు. తపన ఫౌండేషన్ సహకారంతో జేఆర్​జీ కమ్యూనికేషన్ నెట్​వర్క్ ఆధ్వర్యంలో జంగారెడ్డి గూడెంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన శ్రీరామ్ మాట్లాడుతూ గోదావరి జిల్లాల్లో సంక్రాంతి పండుగను ఎంతో ఘనంగా నిర్వహిస్తారన్నారు. సంప్రదాయాలు పరిరక్షణలో భాగంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరవ్వటం చాలా సంతోషంగా ఉందని శ్రీరామ్ తెలిపారు. 

Sankranthi Celebrations: సంక్రాంతి సంబరాల్లో భాగంగా జేఆర్​జీ కమ్యూనికేషన్ నెట్​వర్క్ నిర్వహించిన ముగ్గుల పోటీలో మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు. అనంతరం మహిళలు కోలాటం ఆడుతూ, పాటలు పాడుతూ భోగి మంటల చుట్టూ తిరిగి సందడి చేశారు. ఈ సంబరాల్లో భాగంగా సంక్రాంతి పండగ విశిష్టతను తెలియజేసే విధంగా భోగి మంటలు, భోగి పళ్లు వంటి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.