ఆంధ్రప్రదేశ్

andhra pradesh

టీడీపీ, జనసేన కలవకుండా జగన్​మోహన్​రెడ్డి ఎన్నో ప్రయత్నాలు చేశారు : ఎంపీ రఘురామ

By

Published : Jan 13, 2023, 9:58 PM IST

Raghu Rama : జనసేన, టీడీపీ పొత్తుపై ఎంపీ రఘురామకృష్ణరాజు స్పందించారు. వారి కలయిక ప్రస్తుత ప్రభుత్వాన్ని గద్దె దించటమే తక్షణ కర్తవ్యంగా సాగాలని కోరారు. పొత్తుపై వైసీపీ నేతల వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయన్నారు.

Raghu Rama Krishna Raju
ఎంపీ రఘురామ

Raghu Rama Krishna Raju : సమాజహితం కోసం చంద్రబాబు, పవన్​ కలిసి ప్రస్తుత ప్రభుత్వాన్ని గద్దె దించడమే కర్తవ్యంగా ముందుకు సాగలని ఎంపీ రఘురామకృష్ణరాజు సూచించారు. రణస్థలంలో జనసేన నిర్వహించిన సభలో పవన్​.. పొత్తులపై స్పష్టతనిచ్చారని అభిప్రాయం వ్యక్తం చేశారు. టీడీపీ, జనసేన పార్టీల రంగు కలిస్తే కషాయమని.. కాషాయ పార్టీ ఈ రెండు పార్టీలకు తోడుండాలని కోరుకునే వారిలో నేనొకడినని రఘురామ అన్నారు. టీడీపీ, జనసేన పార్టీలు కలవకుండా జగన్​మోహన్​రెడ్డి ఎన్నో ప్రయత్నాలు చేశారని ఆరోపించారు.

విడగొట్టేందుకు ఎన్నో ప్రయత్నాలు చేశారని విమర్శించారు. గతంలో చంద్రబాబును తిట్టి ఇప్పుడు ఆయనతో ఎలా కలుస్తారని వైసీపీ నేతలు ప్రశ్నించటం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. గతంలో జగన్​ను తిట్టిన నేతలకే జగన్​ మంత్రి పదవులు ఇచ్చారని ఆరోపించారు. మనం చేస్తే రాజకీయం రాజకీయం ఎదుటి వారు చేస్తే వ్యభిచారమా అని నిలదీశారు. జీవో నెంబర్​ ఒకటిని న్యాయస్థానం రద్దు చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details