ఆంధ్రప్రదేశ్

andhra pradesh

రాష్ట్రంలో తుపాను - పలు జిల్లాల్లో విద్యా సంస్థలకు రేపు, ఎల్లుండి సెలవులు

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 3, 2023, 8:10 PM IST

Michaung Cyclone to Andhra Pradesh Live Updates: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో బలపడిన మిచౌంగ్‌ తుపాను ముంచుకొస్తుంది. తుపాను మంగళవారం మధ్యాహ్నంలోపు నెల్లూరు, మచిలీపట్నం మధ్య తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మిచౌంగ్‌ ప్రభావంతో పలు చోట్ల వర్షాలు పడుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్ష సూచన ఉండటంతో అన్నదాతలు అల్లాడుతున్నారు. చేతికొచ్చిన పంటనీటి పాలైపోతుందేమోనని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తుపాను కారణంగా పాఠశాలలకు, కాలేజీలకు అధికారులు సెలవులు ప్రకటించారు.

Michaung_Cyclone_to_Andhra_Pradesh_Live_Updates
Michaung_Cyclone_to_Andhra_Pradesh_Live_Updates

రాష్ట్రంలో తుపాను - పలు జిల్లాల్లో విద్యా సంస్థలకు రేపు, ఎల్లుండి సెలవులు

Michaung Cyclone to Andhra PradeshLive Updates :పశ్చిమ మధ్య బంగాళఖాతంలో ఏర్పడిన వాయుగుండంతో రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. తుపాను దృష్ట్యా విజయవాడ-చెన్నై-భువనేశ్వర్‌ సహా పలు మార్గాల్లో రెండు రోజుల పాటు రైళ్లు రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.

Farmers Suffer with Heavy Rains :ఒక వైపు కోతకు వచ్చిన వరి పైరు, మరోవైపు తుపాను హెచ్చరికలతో కృష్ణా జిల్లా అన్నదాతల గుండెల్లో గుబులు పుడుతోంది. ధాన్యం సేకరణకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని గత నెల రోజులుగా సమీక్షలతో ఊదరగొడుతున్నా ఆచరణలో మాత్రం అమలు కావడం లేదు. కల్లాల్లో ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో అన్నదాతలు రోడ్డెక్కి ఆందోళన చేయాల్సిన దుస్ధితి నెలకొంది. కోతలు కోయాలంటే వర్షాలు వస్తాయనే సమాచారంతో రైతుల్లో కలవరం ప్రారంభమైంది. కూలీలతో కోతలు కోసి కుప్పలు వేయాలంటే దాదాపు 10 రోజుల సమయం పడుతుంది.

Cyclone Michaung High Alert to AP :తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో రైతులు యంత్రాల సహయంతో వరి కోతలు కోయిస్తున్నారు. తేమ శాతం 20 శాతం కంటే లోపు ఉంటే ధాన్యాన్ని అధికారులు కోనుగోలు చేయడం లేదని అన్నదాతలు వాపోతున్నారు. గాలి దుమారంతో తుపానులు వచ్చే అవకాశం ఉండటంతో వరి పైరు నేలకు ఒరిగే ప్రమాదం ఉందని ఆరుగాలం కష్టపడి పంట చేతికి వచ్చే సమయంలో తుపాను రావడం పట్ల రైతులు తీవ్ర కలత చెందుతున్నారు. ప్రభుత్వం ధాన్యం కోనుగోలు చేసేందుకు ఇబ్బందులు పెడుతోందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

రాష్ట్రంలోనూ మిచౌంగ్ తుఫాన్​ ప్రభావం - మొదలైన వర్షాలు

Heavy Rains in AP :తుపాను హెచ్చరికల నేపథ్యంలో అన్నదాతలు అల్లాడుతున్నారు. చేతికొచ్చిన పంట, తుపాను వల్ల చేజారిపోతుందేమోనని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు గోనె సంచుల కొరత వల్ల ధాన్యం దాచుకోవడం చాలా కష్టంగా మారిందంటున్నారు. తేమ శాతం గురించి పక్కన పెట్టి ప్రభుత్వం వెంటనే ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

Heavy Rains Lash Nellore :నెల్లూరు జిల్లాలో శనివారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వాన పడుతోంది. కందుకూరు, కావలి, కోవూరులో అనేక రోడ్లు వాగులను తలపిస్తున్నాయి. నగరంలోని ఆత్మకూరు బస్టాండ్, రామలింగాపురం, మాగుంట లేఅవుట్‌ ప్రాంతాల్లోని అండర్‌ బ్రిడ్జిలు నీట మునిగాయి. ఇంకా రెండు రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉండటంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

Schools Holidays due to Rains :తుపాను కారణంగా రేపు కృష్ణా జిల్లాలోని అన్ని పాఠశాలలకు కలెక్టర్ సెలవు ప్రకటించారు. రేపు వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా మంగళవారం పాఠశాల నిర్వహణపై నిర్ణయం తీసుకుంటామని తెలిపిన జిల్లా విద్యాశాఖ అధికారులు తెలిపారు.

రేపు, ఎల్లుండి సెలవులు : తుపాను నేపథ్యంలో ఉమ్మడి గుంటూరు జిల్లా, బాపట్ల జిల్లాలో ఈ నెల 4, 5 తేదీల్లో పాఠశాలలు, కళాశాలలకు బాపట్ల కలెక్టర్ రంజిత్ బాషా సెలవులు ప్రకటించారు. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో అప్రమత్తంగా ఉండాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

బంగాళాఖాతంలో అల్పపీడనం - రాబోయే మూడు రోజులు వర్షాలు

ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆదేశాలు :తుపాను దృష్ట్యా తీసుకోవాల్సిన చర్యలపై ముఖ్యమంత్రి జగన్‌ అధికారులతో సమీక్ష నిర్వహించారు. విద్యుత్‌, రవాణా, సమాచార వ్యవస్థ దెబ్బతింటే యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరించేందుకు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. సహాయక చర్యలపై ఎప్పటికప్పడు తనకు నివేదించాలని తెలిపారు. పొలాల్లో కల్లాల్లోని ధాన్యం తడిసిపోకుండా పౌర సరఫరాల శాఖ అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. తేమ లాంటి సాంకేతిక అంశాలను పక్కనబెట్టి రైతుల వద్ద ఉన్న ధాన్యాన్ని వెంటనే సేకరించి, భద్రతమైన ప్రాంతాలకు తరలించాలని స్పష్టం చేశారు.

అప్రమత్తమైన అధికారులు : తుపాను ముంచుకొస్తున్న నేపథ్యంలో తీర ప్రాంతాల్లోని జిల్లాల అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. కృష్ణా జిల్లాలోని కలెక్టరేట్‌తో పాటు తహసీల్దార్‌ కార్యాలయాల్లో కంట్రోలు రూములు ఏర్పాటు చేశారు. లోతట్టు ప్రాంత ప్రజలను అవసరాన్ని బట్టి తరలించేందుకు పునరావాస కేంద్రాలు సిద్ధం చేశారు. మంగినపూడి బీచ్‌లో సందర్శకులను రానీయకుండా ఆంక్షలు విధించారు. మత్స్యకారులను సైతం వేటకు వెళ్లొద్దని ఆదేశాలు జారీ చేశారు. కాకినాడ జిల్లాలో అంతర్భాగమైన కేంద్రపాలిత ప్రాంతం యానం డిప్యూటీ కలెక్టర్‌ ప్రభుత్వ యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. ఏదైనా ఆపద ఎదురైతే తక్షణం స్పందించాలని రెవెన్యూ, పోలీసులకు సూచించారు.

Crops Damaged Due to Heavy Rains: పల్నాడు రైతులను నిండా ముంచిన వర్షాలు.. ప్రభుత్వ సాయానికై అన్నదాతల ఎదురుచూపులు..

ABOUT THE AUTHOR

...view details