ETV Bharat / state

ముంచుకొచ్చిన తుపాను - చలనం లేని అధికారులు 'ధాన్యం కొనుగోళ్లకు రైతుల ఎదురుచూపులు'

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 2, 2023, 5:48 PM IST

Farmers are Facing Difficulties in Grain Sales: కృష్ణా జిల్లా, దివిసీమలో వివిధ మండలాల్లో ఉన్న రైతులు ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి నానా తంటాలు పడుతున్నారు. తుపాను హెచ్చరికతో వీరి ఆందోళన మరింత పెరిగింది. రైతు భరోసా కేంద్రాలు కూడా అలంకారప్రాయంగా తయారవడంతో ఎంతో కష్టపడి పండించిన పంటను మద్దతు ధరకు కాకుండా ఎంత ధర వస్తే అంతకు అమ్ముతున్నారు. మరికొందరు రోడ్ల పక్కనే గుట్టలుగా ధాన్యపు రాశుల నిల్వలు పెట్టుకుని పరదాలు కప్పుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది.

Farmers_are_Facing_Difficulties_in_Grain_Sales
Farmers_are_Facing_Difficulties_in_Grain_Sales

Farmers are Facing Difficulties in Grain Sales: ధాన్యం కొనండి మహాప్రభో అంటూ అన్నదాతలు ఆర్తనాదం చేస్తున్నారు. పకృతి దోబూచులాటలో ప్రభుత్వం ప్రకటనలకే పరిమితం కాగా అలంకారప్రాయంగా ఆర్బీకే(రైతు భరోసా కేంద్రాలు RBK) లు తయారయ్యాయి. ధాన్యం నూర్పిడి చేసుకుని రోడ్డు ప్రక్కన రాశులు ఆరబెట్టుకుని అమ్మకానికి ఎదురు చూస్తున్న రైతుకు తేమ శాతం 20 లోపు ఉంటేనే కొనుగోలు చేస్తామని తెలపడంతో ఒక్కసారిగా రైతులు అయోమయ స్థితిలో పడ్డారు.

ముంచుకొచ్చిన తుపాను - చలనం లేని అధికారులు 'ధాన్యం కొనుగోళ్లకు రైతుల ఎదురుచూపులు'

ధాన్యాన్ని రోడ్డుపై వేసి ఆందోళనకు దిగిన కృష్ణా జిల్లా రైతులు

కృష్ణా జిల్లా, దివిసీమలో ఘంటసాల మండలం -17402 , చల్లపల్లి మండలం - 14967 , మోపిదేవి మండలం -14580 ఎకరాలు పంట పండిస్తున్నారు. మొత్తం ఈ మూడు మండలాల్లో 46,949 ఎకరాల్లో వరి పంట కోత దశకు చేరుకుంది. ఈ మండలాల్లో 1061 వరి రకం ఎక్కువగా సాగుచేస్తారు. ఇప్పటికే ఈ మూడు మండలాల్లో సుమారు 5 వేల ఎకరాల్లో వరి పంట నూర్పిడి చేసి ధాన్యం రాశులు రోడ్డు ప్రక్కన, ఇతర చోట్ల అరబెట్టుకున్నారు. అవనిగడ్డ, నాగాయలంక, కోడూరు మండలాల్లో వరి పంట కోత దశకు రావడానికి మరికొంత సమయం పడుతుంది.

"కోత కోసే మిషన్​కు ప్రస్తుతం గంటకు రూ.3200 చెల్లిస్తున్నాం. కొన్ని చోట్ల కులీలతో కోత కోయిస్తే ఎకరాకు రూ.4500గా ఖర్చు అవుతుంది. బంగాళాఖాతంలో ఏర్పడ్డ తుఫానుతో భారీ వర్ష సూచన ఉన్నట్టు వాతావరణ శాఖ తెలియజేయడంతో మా గుండెల్లో రైలు పరిగెడుతున్నాయి. తేమ శాతంలో రైతుకు మినహాయింపు ఇచ్చి, రైతు వాహనం ద్వారా ధాన్యాన్ని మిల్లుకు తీసుకెళ్లే విధంగా చర్యలు తీసుకోవాలి ". - రైతులు

Farmers Selling Grain at Loss Price: కొద్దిరోజుల క్రితం వరకు పంటకు సాగునీరు లేక రాత్రి పగలు అష్టకష్టాలు పడి, ఆరుగాలం కష్టపడి పండించిన పంట అమ్ముడుపోక అన్నదాతలు ఆర్తనాదాలు చేస్తున్నారు. అట్టహాసంగా ప్రారంభించిన ఆర్బికేలు అలంకారప్రాయంగా మారాయి. దీంతో రోడ్ల ప్రక్కనే గుట్టలు గుట్టలుగా ధాన్యపు రాశుల నిల్వలు పెట్టుకుని పరదాలు కప్పుకొంటున్నారు. ధాన్యం అమ్మకానికి రైతులు రోజులు తరబడి పడిగాపులు పడాల్సి వస్తుంది.

పంట నష్టాన్నిఅంచనా వేయాలన్న ప్రభుత్వం - జంకుతున్న అధికారులు- జగన్ వ్యాఖ్యలే కారణమా?


ప్రభుత్వం ఈ ఏడాది ప్రకటించిన కనీస మద్దతు ధర కొంతమేర ఊరటగానే ఉంది. కానీ అది అన్నదాతలకు అందని ద్రాక్షగా మారింది. కొనుగోళ్లు సన్న గిల్లడంతో అమ్మకాలు మందగించి రైతులు రోడ్ల పాలవుతున్నారు. ధాన్యపు రాశుల వద్ద రేయనక పగలనకా గడుపుతుంటే సందట్లో సడే మియా అంటూ దళారులు దండుకుంటున్నారు. రైతులు అనేక చోట్ల తమ ధాన్యాన్ని తెగ నమ్ముకుంటున్నారు. కనీస మద్దతు ధర ప్రకారం 1061 తెలుపు రకం ధాన్యానికి 77 కిలోల బస్తాకు గాను రూ.1640 వచ్చే అవకాశం ఉండగా ఆర్బీకేల ద్వారా కొనుగోళ్లు అరకొరగా జరగడంతో, తేమ శాతం 20 లోపు ఉంటేనే కొనుగోలు చేస్తామని ఆర్బీకే వాళ్లు చెబుతున్నారు. దీంతో ఈ ధాన్యం బస్తా రూ.1250 నుంచి 1300కే తెగనమ్ముకోవాల్సి వస్తుంది. ఫలితంగా దాదాపు రూ.400 కోల్పోతూ ఒక్కో ఎకరానికి రూ.13 వేలు నష్టపోవాల్సి వస్తుందని రైతులు ఆవేదన చెందుతున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.