ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Irregularities in Jagananna Vidya Kanuka: గుత్తేదారులకు జగనన్న విద్యా'కానుక'.. విద్యార్థుల సంఖ్యకు మించి కిట్ల కొనుగోళ్లలో ఆంతర్యమేంటి!

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 29, 2023, 12:10 PM IST

Updated : Oct 29, 2023, 1:16 PM IST

Irregularities in Jagananna Vidya Kanuka: ప్రభుత్వం విద్యార్థులకు అందించే విద్యాకానుక కిట్లు గుత్తేదారులు, అధికారులకు కాసుల వర్షం కురిపిస్తున్నాయి. లెక్కకు మించి కిట్లను కొనుగోలు చేయడం.. మిగిలిపోయిన వాటి వివరాలు మాయం చేస్తూ కోట్లలో దండుకుంటున్నారు. కిట్ల కొనుగోళ్లలో అక్రమాలపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవడంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం విఫలం కావడంతో గుత్తేదార్లు యథేచ్ఛగా ప్రజాధనాన్ని దోపిడీ చేస్తున్నారు.

Irregularities_in_Jagananna_Vidya_Kanuka
Irregularities_in_Jagananna_Vidya_Kanuka

Irregularities in Jagananna Vidya Kanuka: గుత్తేదారులకు జగనన్న విద్యా'కానుక'.. విద్యార్థుల సంఖ్యకు మించి కిట్ల కొనుగోళ్లలో ఆంతర్యమేంటి!

Irregularities in Jagananna Vidya Kanuka :ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అందిస్తున్న విద్యాకానుక కిట్ల కొనుగోళ్లు ఓ కీలక ప్రజాప్రతినిధికి, సమగ్ర శిక్షా అభియాన్‌లోని ఇద్దరు అధికారులకు కాసులు కురిపిస్తున్నాయి. విద్యార్థుల సంఖ్యకు మించి సామగ్రి కొంటూ కోట్లలో దండుకుంటున్నారు. సర్కారీ బడుల్లో మూడేళ్లుగా విద్యార్థుల సంఖ్య తగ్గిపోతున్నా పట్టించుకోవడం లేదు. 2023-24 విద్యా సంవత్సరానికి విద్యార్థులు 38.25 లక్షలు ఉండగా 39.96లక్షల కిట్లు కొన్నారు. మిగిలిపోయిన 1.70లక్షల కిట్లు ఎక్కడున్నాయో తెలియదు. సమగ్ర శిక్షా అధికారుల తనిఖీల్లో 10శాతం సామగ్రినే గుర్తించగలిగారు. కిట్లు కనిపించకుండా పోవడంతో ఆఫ్‌లైన్‌లో పిల్లలకు ఇచ్చిన పేపర్‌పై వివరాలు రాసిచ్చినా పర్లేదంటూ క్షేత్రస్థాయికి ఆదేశాలిచ్చారు. ఒక్కో కిట్టుకు సగటున 2,100 రూపాయలు వెచ్చించారు. ఈ లెక్కన 35.71 కోట్ల విలువైన సామగ్రి గల్లంతైంది.

Differences in Vidya Kanuka Kits calculations :గతేడాది కొన్న విద్యాకానుక కిట్లలోనూ భారీగా అక్రమాలు జరిగాయి. 2022-23లో ఒక్కోటి 1,565 చొప్పున 45,14, 687 కిట్లు కొన్నారు. ఆ ఏడాది విద్యార్థుల సంఖ్య 40,66,528 మాత్రమే. దీంతో 4.48లక్షల కిట్లు మిగిలాయి. వాటిలోని కొన్ని వస్తువులు మాయమయ్యాయి. ఈ ఏడాది 38,25,991 మంది విద్యార్థులుండగా, తొలుత 43,10,165 కిట్లకు ప్రభుత్వం పరిపాలన అనుమతులిచ్చింది. తర్వాత కుదించి 39.96లక్షల కిట్లు కొనుగోలు చేసింది. పాతవి వినియోగించగలిగినప్పుడు, రెండేళ్లుగా ఎందుకు అదనంగా కొంటున్నారన్నది ప్రశ్న.

Jagananna Vidya Kanuka Kits: జ్యుడిషియల్‌ ప్రివ్యూకు పంపకుండానే టెండర్లు.. భారీగా ప్రజాధనం వృథా

Jagananna Vidya Kanuka Only for Contractors :జరిమానాలు బిల్లులు చెల్లింపు : గతేడాది మిగిలిన కిట్లకు లెక్కలులేకపోయినా గుత్తేదార్లకు ప్రభుత్వం పూర్తిగా బిల్లులు చెల్లించింది. క్షేత్రస్థాయి అధికారులపై ఒత్తిడి తెచ్చి అన్ని వస్తువులూ ముట్టినట్లు నివేదికలు తీసుకొని డబ్బులు ఇచ్చేసింది. ఈ ఏడాది లెక్కల్లోనూ తేడాలున్నా బిల్లులు చెల్లించేందుకు సిద్ధమైంది. కిట్లు సకాలంలో అందించకపోయినా, నాణ్యత లేకపోయినా గుత్తేదార్లకు జరిమానా వేసే అధికారం ప్రభుత్వానికి ఉంది. గతేడాది 6 లక్షలకుపైగా బ్యాగులు చినిగిపోగా, గుత్తేదార్లకు జరిమానా వేయాలంటూ క్షేత్రస్థాయి అధికారులు పంపిన ఫైల్‌ను ఉన్నతాధికారులు తొక్కిపెట్టారు. జరిమానాలు లేకుండా పూర్తిగా బిల్లులు చెల్లించారు.

PRATHIDWANI: విద్యాకానుక కిట్లు అందకుండా చదువులు సాగేది ఎలా ?
Illegal in Jagananna Vidya Kanuka Kits Purchases : అంతుచిక్కని ప్రశ్నలు ఎన్నో ఎన్నెన్నో :గతేడాది 4.48 లక్షల కిట్లు మిగిలాయి. వాటిలోంచి 1,46,485 బెల్టులను ఈ ఏడాది ఇచ్చినట్లు అధికారులు చెప్పారు. మిగిలిన 3,01,674 బెల్టులు ఏమయ్యాయో తెలియాల్సి ఉంది. గతేడాది బూట్లలో 69 వేల జతలు మిగిలాయని ప్రభుత్వం చెబుతోంది. మిగతా 3.78లక్షల జతల బూట్ల జాడే లేదు. గతేడాది ఏకరూప దుస్తులు 2,56,797 మిగలగా, కేజీబీవీలు, ఆదర్శ పాఠశాలలు, ఏపీఆర్‌ఎస్‌లోని ఇంటర్‌ విద్యార్థులకు ఇచ్చినట్లు ప్రభుత్వం చెబుతోంది. 4.48లక్షల కిట్లలో, మూడు జతల చొప్పున 13.44 లక్షల జతల దుస్తులుండాలి. 2.56లక్షలు పంచగా, మిగతా 10.87 లక్షల జతలు ఏమయ్యాయనేది అంతుచిక్కని ప్రశ్నే.

పాడైపోయిన బ్యాగులను వెనక్కి పంపి, వాటిస్థానంలో కొత్తవి ఇచ్చినట్లు విద్యాశాఖ చెబుతోంది. మిగిలిపోయిన 4.48లక్షల బ్యాగులను పట్టించుకోకుండానే గుత్తేదారుకు 45.14 లక్షల బ్యాగులకు బిల్లులు చెల్లించేశారు. నోటు పుస్తకాలు 5,46,928 మిగలగా, ఈసారి పంపిణీ చేశామంటోంది. ఒక్కో విద్యార్థికి 6 పుస్తకాలు అవసరం. 4.48లక్షల కిట్లు మిగిలినందున ఒక్కో కిట్టుకు 6 చొప్పున 26.88లక్షల పుస్తకాలుండాలి. కానీ, 5.46 లక్షలే ఉన్నాయంటే మిగతావి ఏమయ్యాయి. పాతవి పంపిణీ చేస్తే ఈ ఏడాది మిగిలిన వస్తువుల సంగతి తేల్చాల్సి ఉంది.

గుత్తేదారులకే విద్యా'కానుక'.. విద్యార్థులు తగ్గినా.. ప్రభుత్వంపై మాత్రం..!

Last Updated :Oct 29, 2023, 1:16 PM IST

ABOUT THE AUTHOR

...view details