ఆంధ్రప్రదేశ్

andhra pradesh

How to Download Digital Voter ID Card With Photo: మీ ఫొటోతో డిజిటల్ ఓటర్ ఐడీ కార్డు.. ఎలా​ డౌన్​లోడ్ చేసుకోవాలంటే?

By

Published : Aug 17, 2023, 3:01 PM IST

How to Download Digital Voter ID Card With Photo: ఓటు హక్కు కలిగిన ప్రతీ ఒక్కరికి కేంద్ర ఎన్నికల సంఘం ఫొటోతో కూడిన డిజిటల్​ ఓటర్​ ఐడీ కార్డు(e-EPIC card)ను డౌన్​లోడ్​ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తోంది. మీ స్మార్ట్​ పోన్​లోనే ఈ కార్డును ఎలా డౌన్​లోడ్​ చేసుకోవాలో తెలుసుకోవాలనుకుంటున్నారా..? ఈ కథనం మీకోసమే...

Digital_Voter_ID_Card
Digital_Voter_ID_Card

How to Download Digital Voter ID Card With Photo: ఓటు హక్కు వజ్రాయుధం వంటిది. దేశ భవిష్యత్​ని మార్చే పాలకులను ఎన్నుకునే విషయంలో చాలా ముఖ్యమైంది. అందుకే 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటర్​గా తప్పక నమోదు చేసుకోవాలి. త్వరలో తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే చాలా వరకు ఓటర్ల జాబితాల్లో మార్పులు చేర్పులు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్​లో పాలక పార్టీ భారీ సంఖ్యలో కొత్త ఓటర్లను నమోదు చేస్తూ ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన ఓటర్లను తొలగిస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

Download Digital Voter ID Card with Photo: ఓటర్​ ఐడీ కార్డు అంటే చాలా మందికి కేవలం ఎన్నికల సమయంలో మాత్రమే గుర్తుకు వస్తుంది. ఆ రోజు వరకే చేతిలో ఉంచుకుని తర్వాత భద్రంగా దాచిపెడతారు. కానీ ఓటర్​ ఐడీ కార్డు ఎన్నికలప్పుడు మాత్రమే కాక ఇతర సందర్భాల్లోను ఉపయోగపడుతుంది. ఈ కార్డును ప్రతీ సారి మన వెంట తీసుకెళ్ల లేము. ఒక్కోసారి పొరపాటున మర్చిపోతుంటాం. అలాంటి వారి కోసం కేంద్ర ఎన్నికల సంఘం స్మార్ట్​ ఫోన్​లోనే ఈ డిజిటల్​ ఓటర్​ ఐడీ కార్డుని డౌన్​లోడ్​ చేసుకోనే అవకాశం కల్పించింది.

e-EPIC card: రెండేళ్ల క్రితమే కేంద్ర ఎన్నికల సంఘం ఈ డిజిటల్​ ఓటర్​ ఐడీ కార్డు(e-EPIC card)ను డౌన్​లోడ్​ చేసుకునే అవకాశాన్ని కల్పించింది. ఆధార్, పాన్ కార్డు మాదిరిగానే డిజిటల్ ఓటర్ కార్డు కాపీని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ డిజిటల్​ కార్డును ఎన్నికల సమయంలో చూపించి ఓటు వేయవచ్చు. ఈ కార్డుని పీడీఎఫ్​గా డౌన్​లోడ్​ చేసుకుని ప్రింట్​ తీసుకోవచ్చు.

ఫొటోతో కూడిన డిజిటల్​ ఓటర్​ ఐడీ కార్డు డౌన్​లోడ్​ చేసుకోండిలా..

మీ స్మార్ట్​ఫోన్​లో ఫస్ట్​ కేంద్ర ఎన్నికల సంఘం అధికారిక వెబ్​సైట్​ ఓపెన్​ చేయండి. ఆ వెబ్​సైట్​లో మీరు ఇప్పటికే రిజిస్టర్​ చేసుకుంటే ఆ వివరాలతో లాగిన్​ అవ్వండి. లేకపోతే మీ మొబైల్​ నంబర్​తో రిజిస్టర్​ చేసుకుని లాగిన్​ అవ్వాలి. లాగిన్​ అయిన తర్వాత కేంద్ర ఎన్నికల సంఘం హోం పేజీలోకి వెళ్లండి. అక్కడ e-epic Download ఆప్షన్​ కనిపిస్తుంది. దానిపై క్లిక్​ చేయండి. ఆ తర్వాత మీ ఓటర్​ కార్డు నంబర్​ను నమోదు చేసి ఏ రాష్ట్రానికి చెందిన వారో ఆ వివరాలు సెలక్ట్​ చేయాలి. ఆ తర్వాత అన్ని వివరాలు ఎంటర్​ చేసిన తర్వాత సెండ్​ ఓటీపీ(Send OTP) ఆప్షన్​పై క్లిక్​ చేయాలి. వెంటనే మీ ఓటర్​ కార్డుకు లింక్​ అయిన మొబైల్​ నంబర్​కు వచ్చిన ఓటీపీని ఎంటర్​ చేయాలి. మొబైల్​ నంబర్​ వెరిఫై కాగానే క్యాప్చా కోడ్​ ఎంటర్​ చేయాలి. ఆ తర్వాత Download e-EPIC Option పైన క్లిక్ చేయాలి. వెంటనే మీకు నాన్ ఎడిటెబుల్ పీడీఎఫ్ ఫార్మాట్‌లో డిజిటల్ ఓటర్ ఐడీ కార్డ్ డౌన్‌లోడ్ అవుతుంది.

చంద్రబాబు లేఖతో అధికారులపై చర్యలకు దిగిన ఎన్నికల సంఘం.. పలువురికి షో కాజ్ నోటీసులు

ABOUT THE AUTHOR

...view details