ఆంధ్రప్రదేశ్

andhra pradesh

మార్గదర్శిపై కక్షపూరితంగా దాడులు చేస్తున్నారు: మార్గదర్శి అధికారులు

By

Published : Nov 29, 2022, 9:03 AM IST

Margadarsi Chit Fund: రిజిస్ట్రేషన్లు, స్టాంపుల శాఖ ఐజీ రామకృష్ణ చేసిన ఆరోపణలన్నీ అసత్యాలేనన్న మార్గదర్శి ఉన్నతాధికారులు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం కక్షపూరితంగా చేస్తున్న దాడిలో భాగమని మార్గదర్శి అధికారులు పేర్కొన్నారు.

Margadarsi Chit Fund
Margadarsi Chit Fund

Margadarsi Chit Fund: మార్గదర్శి చిట్‌ఫండ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌పై, రిజిస్ట్రేషన్లు, స్టాంపుల శాఖ ఐజీ రామకృష్ణ చేసిన ఆరోపణలన్నీ అసత్యాలేనని.. ఆ సంస్థ ఉన్నతాధికారులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కక్షపూరితంగా చేస్తున్న దాడిలో.. ఇది భాగమని పేర్కొన్నారు. 60 ఏళ్లుగా చట్టబద్ధంగా నడుస్తున్న మార్గదర్శి చిట్‌ఫండ్స్‌పై, ఏపీ సర్కార్‌ దురుద్దేశపూర్వకంగానే ఈ దాడులకు తెగబడుతోందని వివరించారు. ఖాతాదారుల్లో అనుమానాలు రేకెత్తించి... సంస్థ వ్యాపార ప్రయోజనాలు దెబ్బతీయడమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కుట్రపన్నినట్లు ఐజీ రామకృష్ణ పెట్టిన విలేకరుల సమావేశంలో.. స్పష్టంగా వెల్లడైందని పేర్కొన్నారు. విశ్వసనీయతే ప్రాణంగా, లక్షల మంది ఖాతాదారుల నమ్మకమే పెట్టుబడిగా... నడుస్తున్న మార్గదర్శి సంస్థ, ఈ ఆరోపణల్లోని అసత్యాలను, కుట్రకోణాన్ని ప్రజల ముందు ఉంచుతుందని ఆ సంస్థ ఉన్నతాధికారులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details