ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Farmers Fire on CM Jagan: వ్యవసాయ యంత్ర పరికరాల పంపిణీ పథకానికి సీఎం జగన్‌ ఎగనామం.. రైతన్న ఆగ్రహం

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 5, 2023, 9:45 PM IST

State Farmers Fire on CM Jagan Mohan Reddy: తాను రైతు బిడ్డనని, తమది కర్షక సంక్షేమ ప్రభుత్వమని గొప్పలు చెప్పే సీఎం జగన్‌.. వ్యవసాయ యంత్ర పరికరాల పంపిణీ పథకానికి తూట్లు పొడిచారు. ఐదేళ్లు అవుతున్నా రైతులకు అవసరమైన టార్పాలిన్లు, స్ప్రేయర్ల వంటి వ్యవసాయ పరికరాల ఊసే ఎత్తడం లేదు. ఇప్పటికైనా సీఎం జగన్ మేల్కొని.. వ్యవసాయ యంత్ర పరికరాలను అందించాలని రైతన్నలు వేడుకుంటున్నారు.

State_Farmers_Fire_on_CM_Jagan
State_Farmers_Fire_on_CM_Jagan

Farmers Fire on CM Jagan: వ్యవసాయ యంత్ర పరికరాల పంపిణీ పథకానికి సీఎం జగన్‌ ఎగనామం.. రైతన్న ఆగ్రహం

Farmers Fire on CM Jagan Mohan Reddy: రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై రైతన్నలు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారంలోకి వచ్చి ఐదేళ్లు అవుతున్నా.. సీఎం జగన్ ఇప్పటివరకూ రైతన్నలకు రాయితీపై టార్పాలిన్లు, స్ప్రేయర్ల వంటి వ్యవసాయ పరికరాలను అందించలేదని దుయ్యబడుతున్నారు. ఏ జిల్లాలో బహిరంగ సభ ఏర్పాటు చేసినా.. తాను రైతు బిడ్డనని, తమది కర్షక సంక్షేమ ప్రభుత్వమని తరచూ గొప్పలు చెప్పే సీఎం.. రైతులకు తీరని అన్యాయం చేశారని విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా సీఎం జగన్ మేల్కొని.. రైతులకు వ్యవసాయ యంత్ర పరికరాల పంపిణీ పథకం కింద టార్పాలిన్లు, స్ప్రేయర్లు వంటి పరికరాలను అందించాలని డిమాండ్ చేస్తున్నారు.

YCP Govt not Providing Tarpaulins, Sprayers to Farmers: తాను రైతు బిడ్డనని, తమది కర్షక సంక్షేమ ప్రభుత్వమని తరచూ చెప్పే సీఎం జగన్‌కు.. అదే రైతులకు ఎంతో అవసరమైన పథకాల ఊసు మాత్రం పట్టడం లేదు. కావాలనే పక్కన పెట్టేసి సతాయిస్తున్నారు. వ్యవసాయ యాంత్రీకరణ పథకమే దీనికి ఉదాహరణ. రాష్ట్రంలో 2018-19 వరకు.. యాంత్రీకరణ పథకం కింద పిచికారీ పరికరాలు, టార్పాలిన్లు, ఇతర యంత్ర పరికరాల రాయితీకి 1500 కోట్ల రూపాయలకుపైగా వ్యయం చేశారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక 2019 జూన్‌ తర్వాత నుంచి పథకం అమలుకు మంగళం పాడేసి, రైతుల సహనాన్ని పరీక్షిస్తున్నారు. అధిక వర్షాలతో వరి, మిరప, పసుపు రైతులు ఏటా నష్టపోతున్నా.. వారికి టార్పాలిన్లు ఇవ్వాలనే ఆలోచన కూడా సర్కారులో కొరవడింది.

YSR Yantra Seva Scheme మాదే ప్రభుత్వం.. మాకే యంత్రాలు..! ఇదే గ్రామస్వరాజ్యం అంటున్న జగన్​..

Farmers Fire on YCP Leader:దీంతో రైతులను విపత్తులకు వదిలేసి.. ప్రభుత్వం చోద్యం చూస్తోంది. అద్దె యంత్ర కేంద్రాల ఏర్పాటు పేరుతో వైసీపీ నేతలు, కార్యకర్తలతో సంఘాలు ఏర్పాటు చేసి.. వారికి యంత్ర పరికరాలు మంజూరు చేసి, పరోక్షంగా స్వపక్షీయులకు లబ్ధి చేకూరుస్తోంది. లక్షలాది మంది అన్నదాతల ప్రయోజనాలను విస్మరించింది. ఈ ఏడాది 7 లక్షల 13 వేల మందికి టార్పాలిన్లు, స్ప్రేయర్లు ఇస్తామని చెప్పినా అమలు కాలేదు.

YCP Govt not Giving Personal Subsidized Devices: వ్యవసాయ అద్దె యంత్ర కేంద్రాల ఏర్పాటు.. 2017-18 నుంచి ప్రారంభమైంది. తొలి ఏడాది 275 కేంద్రాలు, 2018-19లో 750 కేంద్రాలు ఏర్పాటయ్యాయి. వీటితో పాటు రాయితీపైపరికరాలను అందజేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక.. 2019-20లో 318, 2020-21లో 792, 2021-22లో 525, 2022-23లో 1727 కేంద్రాలను అందుబాటులోకి తెచ్చారు. ఈ నాలుగేళ్లుగా వ్యక్తిగత రాయితీ పరికరాల జాడేలేదు. వ్యవసాయంలో ఆధునిక సేద్య విధానాలు అందుబాటులోకి వస్తున్నాయి. వాటిని ఎప్పటికప్పుడు అందిపుచ్చుకుంటూ రైతులకు రాయితీపై అందిస్తే సాగు వ్యయం తగ్గుతుంది. దిగుబడులు పెరుగుతాయి. సోలార్ ఆధారితంగా ట్రాప్‌లు, తేమ కొలిచే యంత్రాలు, చిన్నచిన్న కలుపుతీత యంత్రాలు వంటివి ఎన్నో అందుబాటులోకి వచ్చాయి. ప్రభుత్వం కాస్త చేయూత అందిస్తే అవన్నీ రైతులకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

CM Jagan Guntur Tour: రైతులకు తక్కువ అద్దెకు ఆధునిక వ్యవసాయ యంత్ర పరికరాలు: సీఎం

Damage to Chilli and Turmeric Crops Due to Rains:రాష్ట్రంలో కురుస్తున్నభారీ వర్షాలు, వరదలకు రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. కోత కోసిన తర్వాత ఆరబెట్టే సమయంలో ఎడతెరిపిలేని వర్షాలతో వరి రైతులకు నష్టాలు తప్పడంలేదు. ధాన్యాన్ని కాపాడుకునేందుకు పరదా పట్టాలను అద్దెకు తెచ్చుకోవాల్సి వస్తోంది. అద్దె రూపంలోనే ఎకరానికి 10 వేల రూపాయలకుపైగా ఖర్చవుతోంది. అయినా తడిసి మొలకలొస్తున్నాయి. తేమ శాతం పెరగడంతో ధరలోనూ కోత పెడుతున్నారు. 2023 మార్చి నెల నుంచి మే నెల వరకు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాల కారణంగా మిరప, పసుపు తడిసి ముద్దవ్వడంతో రైతులపై కోలుకోలేని దెబ్బ పడింది.

Burden on Marginal Farmers: మొక్కజొన్న రైతుల పరిస్థితీ ఇంతే. తడిసిన ఉత్పత్తులకు ధర తగ్గిపోయింది. పంటలను కాపాడుకునేందుకు రైతులు ఒక్కో టార్పాలిన్‌ను 8 వేల నుంచి 12 వేల రూపాయల వరకు చెల్లించి కొనుగోలు చేయాల్సి వస్తోంది. చిన్న, సన్నకారు రైతులకు ఇది భారమే. అయినప్పటికీ ఈ ప్రభుత్వం మాత్రం రాయితీపై రైతులకు వ్యవసాయ పరికరాలను అందించాలనే ఆలోచనే చేయడం లేదు.

2016-17 One Lakh 24 Thousand Machines Distribution: వ్యవసాయ యాంత్రీకరణ పథకం అమలులో 2016-17 నుంచి 2018-19 వరకు దేశంలోని అన్ని రాష్ట్రాలకూ ఆంధ్రప్రదేశ్ ఆదర్శంగా నిలిచింది. 2018-19లో దేశవ్యాప్తంగా ఇచ్చిన పరికరాల్లో 32 శాతం వాటా మన రాష్ట్రానిదే. లక్షా 24 వేల యంత్ర పరికరాలను అందించింది. కేంద్రం ఇచ్చే రాయితీకి తోడుగా రాష్ట్ర అభివృద్ధి ప్రణాళిక నుంచి కూడా ఏడాదికి 200 కోట్ల రూపాయలకుపైగా ఖర్చు చేశారు.

Distribution of Tractors to Tribal Farmers: రైతు రథం పథకం కింద గరిష్ఠంగా రెండున్నర లక్షల రూపాయల రాయితీపై.. 2017-18లో 12 వేల 217 ట్రాక్టర్లను పంపిణీ చేశారు. 2018-19లోనూ 5 వేలకు పైగా ట్రాక్టర్లను అందించారు. ఎస్సీ, ఎస్టీ రైతులకు యాంత్రీకరణ పథకంలో ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చారు. అప్పటివరకు 50శాతం ఉన్న రాయితీని 70 శాతానికి పెంచారు. గిరిజన ప్రాంతాల్లోని రైతులకు ప్రణాళిక నిధులతో ట్రాక్టర్లు, ఇతర పరికరాలు ఇచ్చారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ రైతులకు యంత్ర పరికరాలు, టార్పాలిన్లు అందాయి.

Prathipati on YSRCP: 'గడిచిన నాలుగేళ్లలో ఎక్కడైనా యంత్ర పరికరాలు ఇచ్చారా?'

ABOUT THE AUTHOR

...view details