ఆంధ్రప్రదేశ్

andhra pradesh

తెలంగాణలో కాంగ్రెస్ హవా - ఏపీలో పార్టీ శ్రేణుల సంబరాలు

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 3, 2023, 5:08 PM IST

Updated : Dec 3, 2023, 5:25 PM IST

Congress Leaders Celebrations in AP on TS Election Results: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టనుంది. దీంతో ఏపీలో ఆ పార్టీ నేతలు బాణసంచా కాల్చి, మిఠాయిలు తినిపించుకుంటూ ఆనందోత్సవాల్లో మునిగి తేలుతున్నారు.

Congress_Leaders_Celebrations_in_AP_on_TS_Election_Results
Congress_Leaders_Celebrations_in_AP_on_TS_Election_Results

Congress Leaders Celebrations in AP on TS Election Results: తెలంగాణలో కాంగ్రెస్‌ గెలుపు ఖాయం కావడంతో ఏపీలోని పలు జిల్లాల్లో పార్టీ శ్రేణులు సంబరాలు జరుపుతున్నారు. బాపట్ల జిల్లా చీరాలలో గడియార స్తంభం కూడలిలో విజయోత్సవాలు మిన్నంటాయి. బాణసంచా కాల్చి, మిఠాయిలు పంచుకుని ఆనందోత్సవాల్లో మునిగి తేలుతున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకు రావడానికి రేవంత్ రెడ్డి కృషి చేసారని, ఆయన పడ్డ కష్టానికి తగిన ఫలితం దక్కిందని చీరాల నియోజకవర్గ ఇంఛార్జ్ దేవరపల్లి రంగారావు అన్నారు. తెలంగాణ ప్రజలు మార్పు కోరుకున్నారని, అదే విధంగా ఏపీలో కూడా వచ్చే ఎన్నికల్లో మార్పు తథ్యమన్నారు.

విజయవాడలోనూ పార్టీ శ్రేణులంతా ఆనందోత్సవంలో మునిగిపోయారు. వచ్చే శాసనసభ ఎన్నికల్లో ఏపీలోనూ తమ పార్టీ తిరిగి పుంజుకుంటుందని ఆత్మవిశ్వాసంతో ఉన్నట్లు ధీమా వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా పాలన సాగిస్తున్న రాష్ట్రంలోని సైకో పాలనకు సైతం చరమగీతం పాడటం ఖాయమని స్పష్టం చేశారు.

దూసుకుపోతున్న కాంగ్రెస్ - తొలి అడుగు అశ్వారావుపేటతో మొదలు

అనంతపురంలోని రాయదుర్గంలో కాంగ్రెస్‌ శ్రేణులు పెద్ద ఎత్తున సంబరాలు నిర్వహంచారు. తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్న కేసీఆర్​కు ఓటర్లు కోలుకోని దెబ్బకొట్టారన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ విజయం వైపు దూసుకు వెళ్తుండటంతో జిల్లాలోని కళ్యాణదుర్గంలో ఆ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున సంబరాలు నిర్వహించాయి కళ్యాణదుర్గం టీ కూడలి వద్దకు భారీ ఎత్తున చేరుకున్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, యువ నాయకులు పెద్ద ఎత్తున బాణసంచా పేల్చి, స్వీట్స్ పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆ పార్టీ నాయకులు మాట్లాడుతూ.. ఏపీలో కూడా తమ పార్టీ నాయకుడు రఘువీరా రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ బలోపేతం అవుతుందని, అందుకోసం తాము నిరంతరం శ్రమిస్తామని పేర్కొన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ విజయం సాధించటం తమకు ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు.

తెలంగాణలో కేసీఆర్​ను ఇంటికి పంపిన ప్రజలు ఏపీలో జగన్మోహన్ రెడ్డి దుకాణం మూయించేందుకు సిద్ధమయ్యారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు జగదీశ్ అన్నారు. అనంతపురంలో కాంగ్రెస్, సీపీఐ పార్టీలు సంయుక్తంగా సంబరాలు చేశారు. తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్న కేసీఆర్​ను ప్రజలు కోలుకోలేని దెబ్బకొట్టారన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు రెండూ ఒక్కటేనని, తాము ఓటు వేస్తే బీఆర్​ఎస్​కు వేసినట్లేనని తెలంగాణ ప్రజలు గుర్తించటంవల్లనే అప్రమత్తమై కాంగ్రెస్ పార్టీని గెలిపించారన్నారు.

తెలంగాణలో కేసీఆర్‌ను గెలిపించడానికి జగన్ కుట్ర పన్నారు : సీపీఐ నారాయణ

తెలంగాణలో మతతత్వ పార్టీని ప్రజలు ఏవిధంగా ఓడించారో, ఏపీలో కూడా జగన్ పార్టీని ఓడిస్తామని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ప్రతాపరెడ్డి చెప్పారు. తెలంగాణ ప్రజలు ఓటుతో సరైన తీర్పు ఇచ్చి కేసీఆర్​కు సరైన బుద్ధి చెప్పారని ఆయన అన్నారు. కాంగ్రెస్, సీపీఐ పార్టీల నేతలు బాణ సంచా కాల్చి సంబరాలు చేసి, సందడి చేశారు.

తెలంగాణలో కాంగ్రెస్‌ విజయం సాధించడంతో కర్నూలులోని పార్టీ కార్యాలయంలో భారీ కేక్‌ కట్‌ చేసి పార్టీ నాయకులు సంబరాలు చేసుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ భారీ విజయం సాధించినందుకు ఎంతో సంతోషంగా ఉందని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బాబూరావు అన్నారు. తెలంగాణలో మతతత్వ పార్టీని ప్రజలు ఓడించి కేసీఆర్‌కు ఏ విధంగా బుద్ధి చెప్పారో అదే రీతిలో ఏపీలో జగన్‌ పాలనకు స్వస్తి చెప్తామని హస్తం పార్టీ నాయకులు తెలిపారు.

బీఆర్ఎస్​కు ఓటేస్తే మళ్లీ దొరల సర్కార్ - కాంగ్రెస్​ను గెలిపిస్తే ప్రజా సర్కార్ వస్తుంది : రాహుల్‌ గాంధీ

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ విజయం దిశగా దూసుకెళ్తుండడంతో శ్రీ సత్య సాయి జిల్లా కదిరి నియోజకవర్గంలో ఆ పార్టీ శ్రేణులు సంబరాలు జరుపుకొంటున్నాయి. కదిరి పట్టణములోని అంబేద్కర్ కూడలి, నల్ల చెరువులో జాతీయ రహదారి పైన కాంగ్రెస్ పార్టీ నాయకులు కేక్ కట్​ చేసి సంబరాలు జరుపుకున్నారు. రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డికి జేజేలు పలుకుతూ నినాదాలు చేశారు.

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిన సందర్భంగా విజయనగరంలో ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. జిల్లా పార్టీ కార్యాలయం వద్ద బాణసంచా కాల్చి, మిఠాయిలు పంచుకున్నారు. గత పదేళ్ల బీఆర్​ఎస్​ పాలనతో ప్రజలు విసుగుచెంది కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ తెలిపారు.

కాంగ్రెస్ పార్టీ గతంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలను, సేవలను తెలంగాణ ప్రజలు గుర్తించి విజయాన్ని అందించారన్నారు. ఏపీలో వైసీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని తెలిపారు. రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీలు పూర్తిగా విఫలమయ్యాయని వచ్చే ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తారన్నారు. తెలంగాణ, కర్ణాటక ఫలితాల మాదిరిగా ఏపీలో కూడా కాంగ్రెస్ విజయ కేతనం ఎగరవేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

Last Updated : Dec 3, 2023, 5:25 PM IST

ABOUT THE AUTHOR

...view details