దూసుకుపోతున్న కాంగ్రెస్ - తొలి అడుగు అశ్వారావుపేటతో మొదలు

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 3, 2023, 12:26 PM IST

thumbnail

Telangana Election Results 2023 Live : తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ దూసుకెళ్తోంది. స్పష్టమైన మెజార్టీతో ముందుకు వెళ్తున్న కాంగ్రెస్‌ పార్టీ తొలి విజయం నమోదు చేసింది. అశ్వారావుపేట అభ్యర్థి ఆదినారాయణరావు విజయం సాధించారు. బీఆర్ఎస్ అభ్యర్థి మెచ్చా నాగేశ్వరరావుపై ఆదినారాయణ గెలుపొందారు. అదే విధంగా ఇల్లెందులో కాంగ్రెస్‌ అభ్యర్థి కోరం కనకయ్య  బీఆర్​ఎస్ అభ్యర్థి హరిప్రియపై విజయం సాధించారు. రామగుండంలో కాంగ్రెస్‌ అభ్యర్థి రాజ్‌ ఠాకూర్‌ బీఆర్​ఎస్ అభ్యర్థి కోరుకంటి చందర్ పై విజయం సాధించారు. మరోవైపు కొడంగల్​, కామారెడ్డి నుంచి బరిలోకి దిగిన టీపీసీసీ అధ్యక్షులు రేవంత్​ రెడ్డి గెలుపు దిశగా పయనిస్తున్నారు. రెండు చోట్లా ముందంజలో కొనసాగుతున్నారు. కామారెడ్డిలో రేవంత్​కు ప్రత్యర్థిగా ఉన్న సీఎం కేసీఆర్​ వెనుకంజలో ఉన్నారు. 

కాగా ఇప్పటికే కాంగ్రెస్ విజయం దిశగా దూసుకుపోతోంది. ఎగ్జిట్ పోల్స్​లో చెప్పినట్టే కాంగ్రెస్​కు తెలంగాణ  ప్రజలు పట్టం కడుతున్నారు. తొలుత  పోస్టల్ బ్యాలెట్లలో సైతం కాంగ్రెస్ హవా కొనసాగించగా, ప్రస్తుతం ఈవీఎంలలో ఓట్లలో కాంగ్రెస్​ అభ్యర్థులు ముందంజలో కొనసాగుతున్నారు. కాంగ్రెస్‌ అభ్యర్థులు తుమ్మల నాగేశ్వర్​రావు, భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి, ఆధిక్యంలో కొనసాగుతున్నారు. 

విజయం దిశగా దూసుకుపోతుండటంతో కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు మొదలు పెట్టారు. బాణసంచా కాలుస్తూ, డ్యాన్స్​లు చేస్తూ తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.