ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ముస్లిం మైనార్టీల ఆస్తులను కబ్జా చేసేవారు మసైపోతారు: చంద్రబాబు

By

Published : Nov 3, 2022, 8:31 PM IST

Updated : Nov 3, 2022, 10:54 PM IST

Chandrababu Naidu: అల్లా కన్నెర్రజేస్తే ముస్లిం మైనార్టీల ఆస్తులు, వక్ఫ్‌ బోర్డు భూములు కబ్జా చేసేవారు.. మసైపోతారని తెలుగుదేశం అధినేత చంద్రబాబు హెచ్చరించారు. రాష్ట్రంలో మార్పు మొదలైందనీ., ఆ మార్పు మొదట ముస్లిం మైనార్టీల్లో స్పష్టంగా కనిపిస్తోందని చంద్రబాబు అన్నారు. వైకాపాకి ఇవే చివరి ఎన్నికలన్న చంద్రబాబు ఎద్దేవా చేశారు.

chandrababu
babu

Chandrababu Naidu: అల్లా కన్నెర్ర చేస్తే ముస్లిం మైనార్టీల ఆస్తులు, వక్ఫ్‌ బోర్డు భూములు కబ్జా చేసేవారు మసైపోతారని తెలుగుదేశం అధినేత చంద్రబాబు హెచ్చరించారు. తెలుగుదేశం పార్టీ మైనార్టీ విభాగం రాష్ట్ర కమిటీతో చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో ముస్లిం మైనార్టీ సభ్యులు భారీగా పాల్గొన్నారు.

రాష్ట్రంలో మార్పు మొదలైందనీ.., ఆ మార్పు మొదట ముస్లిం మైనార్టీల్లో స్పష్టంగా కనిపిస్తోందని చంద్రబాబు అన్నారు. ఇది పెను తుపాన్​గా మారి.. వైకాపా కొట్టుకుపోతుందని ధ్వజమెత్తారు. ముస్లిం మైనార్టీలకు ఏం చేశాడో చెప్పుకునే ధైర్యం జగన్మోహన్ రెడ్డికి ఉందా అని ప్రశ్నించారు. వక్ఫ్ బోర్డు భూములు ఆక్రమించే కబ్జాదారులు చెలరేగిపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సొంత అల్లుళ్లకు రాసిచ్చినట్లు వైకాపా నేతలకు వక్ఫ్ బోర్డు భూములు రాసిస్తున్నారని ఆరోపించారు. రేపు ముస్లిం మైనార్టీల ఆస్తులు దోచుకునేందుకూ వెనకాడరని ధ్వజమెత్తారు.

నీతి నిజాయితీతో ఉన్న షరీఫ్​ను మంత్రులు అవమానించారని మండిపడ్డారు. జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కే ఇచ్చే డబ్బుల కంటే.. నొక్కేసే డబ్బులే ఎక్కువని ఆరోపించారు. ఈ ముఖ్యమంత్రి రంజాన్ తోఫా ఇవ్వకుండా అన్యాయం చేశారని దుయ్యబట్టారు. దుల్హన్ పథకాన్ని ఆంక్షల పథకంగా మార్చి లబ్ధిదారుల్లో భారీ కోత పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేసారు. ముస్లింల అభ్యున్నతికి పాటుపడింది.. తెలుగుదేశం ప్రభుత్వం మాత్రమేనని స్పష్టం చేశారు. వైకాపాకు ఇవే చివరి ఎన్నికలన్న చంద్రబాబు.. పులివెందులలో గెలవలేని వాడు కుప్పంలో గెలుస్తానంటున్నాడని విమర్శించారు.

ఇవీ చదవండి:

Last Updated : Nov 3, 2022, 10:54 PM IST

ABOUT THE AUTHOR

...view details