ఆంధ్రప్రదేశ్

andhra pradesh

గోమాంస విక్రయాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిషేధించాలి: సోము వీర్రాజు

By

Published : Jan 19, 2023, 10:56 PM IST

SomuVeeraju
సోము వీర్రాజు ()

Somu Veerraju: రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు సోము వీర్రాజు హిందువులు పవిత్రంగా ఆరాధించే గోవుల అక్రమ తరలింపును, గో మాంసాల విక్రయాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిషేధించాలని డిమాండ్ చేశారు. గో కళేబరం నుంచి సేకరిస్తున్న కల్తీ నూనె వాడడం వల్ల అనారోగ్య సమస్యలకు దారి తీస్తుందని అన్నారు. అలాగే దళారీ వ్యవస్థను పూర్తిగా నిరోధించాలన్నారు. రైతులకు, ధరలకు సంపూర్ణ మద్దతు ఇవ్వాలని తెలిపారు.

Somu Veerraju: హిందువులు పవిత్రంగా ఆరాధించే గోవుల అక్రమ తరలింపును, గో మాంసాల విక్రయాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిషేధించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు డిమాండ్ చేశారు. కాకినాడ జిల్లా తుని పట్టణ శివారులో ఉన్న తపోవన్న ఆశ్రమం పీఠాధిపతి సచ్చిదానంద సరస్వతి స్వామీజీని కలిశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గోవుల అక్రమ తరలింపుపై అలాగే గోమాంసాన్ని విక్రయించడంపై రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవడంలో విఫలమైందన్నారు. అలాగే ఇటీవలో తుని పట్టణంలో గో కళేబరం నుంచి సేకరిస్తున్న కల్తీ నూనె పట్టుబడిందని, ఇటువంటి నూనె వాడడం వల్ల అనారోగ్య సమస్యలకు దారి తీస్తుందని ఆయన అన్నారు. ఈ గోవధ కేంద్రాలపై నిఘా ఉంచి నిషేధించాలన్నారు.

సోము వీర్రాజు

రాష్ట్ర ప్రభుత్వం రైతులకు నష్టం చేకూర్చుతుందని సోము వీర్రాజు అన్నారు. రైతుల నుంచి సేకరిస్తున్న ధాన్యం నుంచే వచ్చిన బియ్యాన్ని రైతులకు అందజేయాలన్నారు.. రేషన్ డిపోల ద్వారా అక్రమంగా తరలిస్తున్న బియ్యంపై నిఘా కొరవడిందని తెలిపారు. దళారులు ఈ బియ్యాన్ని తక్కువ ధరకు సేకరించిన బియ్యాన్నే తిరిగి ప్రజలకు అమ్మకాలు చేస్తున్నారని అన్నారు. దళారీ వ్యవస్థను పూర్తిగా నిరోధించాలని చెప్పారు. రైతులకు, ధరలకు సంపూర్ణ మద్దతు ఇచ్చి, నష్టాల ఊబి నుంచి బయటికి తేవాలన్నారు.


ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details