ఆంధ్రప్రదేశ్

andhra pradesh

TOP NEWS: ఏపీ ప్రధాన వార్తలు @ 5 PM

By

Published : Dec 5, 2022, 5:01 PM IST

.

AP TOP NEWS
AP TOP NEWS

  • రైతులకు ఇచ్చే మద్దతు ధర పైసా కూడా తగ్గొద్దు: సీఎం జగన్​
    JAGAN REVIEW ON PADDY PROCUREMENT : రైతులకు ప్రభుత్వం ఇచ్చే మద్దతు ధరలో పైసా కూడా తగ్గకుండా ధాన్యం కొనుగోళ్లు చేయాలని అధికారులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశించారు. రైతులకు చేస్తున్న చెల్లింపులన్నీ ప్రత్యక్ష నగదు బదిలీ పద్ధతిలో కార్పొరేషన్‌ నుంచి చెల్లించాలని,.. ఈ విధానాన్ని అత్యంత పారదర్శకంగా అమలు చేయాలన్నారు. రవాణా ఖర్చులు, గన్నీ బ్యాగుల ఖర్చులను ప్రభుత్వమే చెల్లిస్తుందన్న విషయం రైతులకు తెలపాలన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • 'స్మగ్లింగ్‌ ఇన్‌ ఇండియా' 2021-22 రిపోర్ట్​.. ఏపీనే టాప్​
    SMUGGLING IN INDIA 2021 2022 REPORT : దేశంలో పట్టుబడిన మాదకద్రవ్యాలలో అత్యధికశాతం రాష్ట్రంలోనే దొరికినట్లు 'స్మగ్లింగ్‌ ఇన్ ఇండియా' 2021-22 నివేదిక తెలిపింది. దేశంలో పట్టుబడిన మాదకద్రవ్యాలు, అక్రమ ఆయుధాలపై కేంద్ర ప్రభుత్వం నివేదిక విడుదల చేసింది. రాష్ట్రంలో 18 వేల కిలోల డ్రగ్స్‌ను కేంద్ర బలగాలు స్వాధీనం చేసుకున్నట్టు తెలిపింది.పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • CBN TOUR : దిల్లీ చేరుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు
    CBN DELHI TOUR : తెలుగుదేశం అధినేత చంద్రబాబు దిల్లీ చేరుకున్నారు. రాష్ట్రపతి భవన్​లో కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న జీ20 అఖిలపక్ష సమావేశంలో ఆయన పాల్గొననున్నారు. అంతకుముందు పార్లమెంటరీ పార్టీ సమావేశంలో పాల్గొని.. రాజ్యాంగ పరిరక్షణ, ప్రస్తుత ప్రభుత్వంలో చోటు చేసుకున్న అక్రమాలు, అధికారాన్ని ఉపయోగించి చేస్తున్న అరాచకాలపై పార్లమెంటు సాక్షిగా లేవనెత్తాల్సి విషయాలపై చర్చించనున్నట్లు సమాచారం. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • 'ఇచ్చిన హామీలు అమలు చేయకుండా.. ఉన్న ఉద్యోగాలు తీసేస్తున్నారు'
    BJP leader PVN Madhav: అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులపై కుట్రపూరితంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని బీజేపీ శాసనమండలి పక్ష నేత పీవీఎన్‌ మాధవ్ అన్నారు. తాజా ఉత్తర్వులు అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు శరాఘాతంగా మారాయన్నారు. వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం ఇచ్చిన హామీలు అమలు చేయకపోగా.. ఉన్న ఉద్యోగులను తొలగించేందుకు ప్రయత్నిస్తుండటం తగదన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • 'లాలూ ప్రసాద్​కు కిడ్నీ ఇచ్చిన కుమార్తె.. ఆపరేషన్​ సక్సెస్'
    ఆర్జేడీ అధ్యక్షుడు, బిహార్‌ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్‌ యాదవ్‌కు కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స విజయవంతమైందని ఆయన కుమారుడు తేజస్వీ యాదవ్ ట్విట్టర్​ ద్వారా వెల్లడించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • ఆస్పత్రిలో 4 గంటలు పవర్​ కట్​.. నలుగురు నవజాత శిశువులు మృతి
    ఆస్పత్రిలో నాలుగు గంటలపాటు విద్యుత్​ సరఫరా నిలిచపోవడం వల్ల నలుగురు నవజాత శిశువులు మృతి చెందినట్లు కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ విషాద ఘటన ఛత్తీస్​గఢ్​లో జరిగింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • బూడిద వర్షంతో పట్టపగలే కారు చీకట్లు
    ఇండోనేసియాలోని మౌంట్‌ సెమేరు అగ్నిపర్వత విస్ఫోటనంతో తూర్పు జావాలోని నివాసాలు, రహదారులు బూడిదమయం అయ్యాయి. దట్టంగా అలుముకున్న అగ్నిపర్వత ధూళి మేఘాలతో అక్కడ పట్టపగలే కారు చీకట్లు కమ్ముకున్నాయి. అనేక గ్రామాల్లో వేలాది మంది ప్రజలను అధికారుల ఖాళీ చేయిస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • పెరిగిన బంగారం, వెండి ధరలు- ఏపీ, తెలంగాణలో ఎంతంటే..
    Gold Rate Today: దేశంలో బంగారం ధర స్వల్పంగా పెరగగా.. వెండి ధర భారీగా పెరిగింది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే?పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • టీమ్ఇండియా​ నుంచి పంత్​ రిలీజ్​.. గాయమా? లేక క్రమశిక్షణా చర్యలా?
    టీమ్​ఇండియా వికెట్​ కీపర్​ రిషబ్​ పంత్​ను జట్టు నుంచి విడుదల చేశారు. ఈ మేరకు బీసీసీఐ ఓ ప్రకటనలో పేర్కొంది. అయితే పంత్​ను టీమ్​ నుంచి రిలీజ్​ చేయడానికి ఓ కారణం ఉందని సమాచారం. అదేంటంటే.. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • ఒకే రోజు థియేటర్‌లో 17 మూవీస్​ రిలీజ్ మరి ఓటీటీలో ఎన్నంటే
    2022 సంవత్సరం ముగుస్తున్న వేళ కొత్త సినిమాలు విడుదలకు క్యూ కట్టాయి. ఒకటి రెండు కాదు ఏకంగా 15కు పైగా చిత్రాలు ఈ వారం థియేటర్లలో రిలీజ్ కానున్నాయి. అయితే వీటిలో ఏ సినిమాలు పోటీ తట్టుకుని నిలబడతాయో ఏవి వెనకడుగు వేస్తాయో వేచి చూడాలి. ఇక ఈ చిత్రాలతో పాటు ఓటీటీలో కూడా మరికొన్ని రానున్నాయి. మరి అవేంటో చూసేద్దాం. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ABOUT THE AUTHOR

...view details