ఆంధ్రప్రదేశ్

andhra pradesh

'రాంగ్‌ కాల్‌' కలిపింది.. 'తప్పు దోవ' పట్టించింది..

By

Published : Feb 6, 2023, 11:49 AM IST

Updated : Feb 9, 2023, 10:00 PM IST

Rang call love story: ఆమె నంద్యాల జిల్లాకు చెందిన ఓ మహిళ. పెళ్లైన ఏడేళ్లకు భర్త చనిపోవడంతో తల్లిదండ్రుల చెంత చేరింది. ఆ సమయంలోనే ఆమెకు ఓ కాల్​ వచ్చింది. అలా ఫోన్​​ చేసిన వ్యక్తితో పరిచయం ఏర్పడింది. అది కాస్తా పెళ్లికి దారి తీసింది. వాళ్ల పెళ్లికి గుర్తుగా నలుగురు సంతానం ఉన్నారు. అయితే భార్య, పిల్లలతో కలిసి పాకిస్థాన్‌ వెళ్తున్న క్రమంలో అతడిని ఎయిర్​పోర్టులో పోలీసులు అరెస్ట్​ చేశారు. అసలు ఎందుకు అరెస్ట్​ అయ్యాడు? అసలు అతని కథేెంటో? తెలియాలంటే ఇది చదవండి.

Rang call love story
Rang call love story

రాంగ్‌ కాల్‌ కలిపింది.. తప్పు దోవ పట్టించింది..

Wrong call love story: అనుకోని ఫోన్ కాల్.. వారిద్దరినీ కలిపింది. ప్రేయసి కోసం అతడు పాకిస్తాన్‌ నుంచి భారత్‌కు వచ్చాడు. 9 ఏళ్లు సంసారం చేసి నలుగురు పిల్లల్ని కన్నారు. తీరా.. సౌదీ వెళ్లే క్రమంలో పోలీసులకు చిక్కి.. కటకటాలపాలయ్యాడు. ఇప్పుడు ఆ కుటుంబం రోడ్డున పడింది. నంద్యాల జిల్లాకు చెందిన ఆ మహిళ తన భర్తను విడిపించాలంటూ కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు.

నంద్యాల జిల్లా గడివేములకు చెందిన దౌలత్ బీకి గతంలో ఓ వ్యక్తితో వివాహం జరిగింది. కుమారుడు పుట్టాక... భర్త మరణించాడు. కుమారుడితో కలిసి తల్లిదండ్రుల వద్ద జీవిస్తున్న ఆమెకు.. 2010లో ఓ రాంగ్ కాల్ వచ్చింది. ఆ కాల్ ద్వారా పాకిస్థాన్ దేశంలోని పంజాబ్ ప్రావిన్స్‌కు చెందిన గుల్జార్ ఖాన్ అనే వ్యక్తి పరిచయం అయ్యాడు. వారి మధ్య ప్రేమ చిగురించింది. తరచూ ఫోన్‌లో మాట్లాడుకునేవారు. గుల్జార్‌ ఖాన్‌ సౌదీ అరేబియాలో పెయింటర్‌గా పనిచేసేవాడు. ప్రియురాలి కోసం... 2011లో అతడు అక్రమంగా ముంబైలో అడుగుపెట్టాడు.

అక్కడి నుంచి నంద్యాల చేరుకుని... దౌలత్‌బీని కలిశాడు. తర్వాత నిఖా చేసుకుని గడివేములలో కాపురం పెట్టారు. వీరికి నలుగురు పిల్లలు. పెయింటింగ్ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు గుల్జార్. ఆధార్ కార్డు ఆధారంగా... భార్య, ఐదుగురు పిల్లలతో కలిసి సౌదీ అరేబియా వెళ్లేందుకు... వీసాలు తీసుకున్నాడు. అక్కడి నుంచి పాకిస్థాన్ వెళ్లాలనేది వీరి ఆలోచన. 2019లో ఎయిర్‌ పోర్టులో తనిఖీ సిబ్బంది అతనిని అరెస్ట్ చేశారు.

రాంగ్ కాల్‌లో పరిచయమయ్యాడు. కొన్ని రోజులు ఫోన్‌లోనే మాట్లాడుకొని ఇద్దరం ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నాము. పెళ్లి అయిన తరువాత నేను పని చేస్తుంటే అది మాన్పించి..ఆయన పని చేస్తూ నన్ను, పిల్లలను సాకుతుండేవాడు. అలా కొన్ని రోజులకు పాకిస్థాన్‌కి పోవాలని అన్నారు. వాళ్ల అమ్మగారికి ఫోన్ చేసి పిల్లలను, కోడల్ని తీసుకొని వస్తున్నానని చెప్పారు. ఆ తర్వాత సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో దిగగానే క్రైమ్ బ్రాంచ్ పోలీసులు వచ్చి పట్టుకున్నారు.-దౌలత్‌బీ, బాధితురాలు

భర్తను అరెస్టు చేయటంతో... దౌలత్‌బీ పిల్లలతో కలిసి గడివేములకు వచ్చేశారు. తన పెద్ద కుమారుడు కూలీ పనులు చేస్తుండగా.. దౌలత్‌బీ ఇళ్లలో పనులు చేసుకుంటూ... ఐదుగురు పిల్లలతో కుటుంబ భారాన్ని మోస్తోంది. అరెస్టైన ఆరు నెలల తర్వాత... కరోనా రావటంతో గుల్జార్ విడుదలై ఇంటికి చేరుకున్నాడు. ఏడాది పాటు కుటుంబంతో కలిసి జీవించాడు. తాజాగా గతేడాది మరోసారి పోలీసులు అరెస్టు చేసి.. జైలుకు తరలించారు. గుల్జార్‌ను విడుదల చేసి తమకు న్యాయం చేయాలని దౌలత్‌బీతో పాటు ఆమె పిల్లలు కోరుతున్నారు.

ఇవీ చదవండి:

Last Updated :Feb 9, 2023, 10:00 PM IST

ABOUT THE AUTHOR

...view details