ఆంధ్రప్రదేశ్

andhra pradesh

వైఎస్సార్​సీపీ నేతల అరాచకాలు.. ఎంపీటీసీపై అత్యాచారయత్నం కేసు.. మరో ఘటనలో వడ్డీ కోసం మహిళపై దాడి..

By

Published : Jun 18, 2023, 3:59 PM IST

Updated : Jun 19, 2023, 6:41 AM IST

Anarchies of YSRCP leaders
వైఎస్సార్​సీపీ నేతల అరాచకాలు

15:51 June 18

బనగానపల్లె ఎమ్మెల్యేకి ప్రధాన అనుచరుడిగా ఉన్న గోపాల్‌రెడ్డి

వైఎస్సార్​సీపీ నేతల అరాచకాలు

Anarchies of YSRCP leaders: నంద్యాల జిల్లా అవుకు మండలం నిచ్చెనమెట్ల వైయస్సార్ ఎంపీటీసీ సభ్యుడు గోపవరం గోపాల్ రెడ్డిపై పోలీసులు అత్యాచారం కేసు నమోదు చేశారు. నిచ్చెనమెట్ల గ్రామానికి చెందిన ఓ మహిళపై రెండు రోజుల కిందట అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ మహిళ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. అయితే పోలీసులు ఈ ఫిర్యాదును గోప్యంగా ఉంచారు. మహిళ బంధువులు పోలీస్ స్టేషన్​కు వెళ్లి రచ్చ చేయడంతో పోలీసులు ఈ విషయాన్ని ధ్రువీకరించారు. గోపాల్ రెడ్డి ఉమ్మడి జిల్లా ప్రస్తుతం ఎంపీటీసీ సంఘం అధ్యక్షుడిగా కొనసాగుతున్నాడు. ఇతనిపై పోలీసులు ఐపీసీ 448, 354, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

మరో ఘటనలో.. అధికార వైసీపీ నేతల ఆగడాలు రోజురోజుకు హెచ్చు మీరుతున్నాయి. బాపట్ల జిల్లా విద్యార్థి హత్య ఘటన మరువకముందే.. నెల్లూరులో మరో దాష్టీకం జరిగింది. జిల్లాలోని కావలిలో వైసీపీ నేత రెచ్చిపోయాడు. అప్పు తీసుకున్న మహిళ వడ్డీ డబ్బులు ఇంకా చెల్లించాలంటూ నలుగురితో కలిసి జులుం ప్రదర్శించాడు. ‘నన్నెవ్వరూ ఏమీ చేయలేరు. నీకు దిక్కున్న చోట చెప్పుకో’మనిఆమెపై దాడి చేయించాడు. అయితే, అప్పు తీసుకున్న డబ్బులకు వడ్డీతో సహా చెల్లించానని బాధిత మహిళ చెబుతుండడం గమనార్హం. వివరాల్లోకి వెళితే..

YCP leader assaulted woman in Kavali: వైసీపీ నేత మహేంద్రు దగ్గర కరకమిట్ల పార్వతి అనే మహిళ ఏడాది క్రితం రూ.50 వేలు అప్పు తీసుకున్నారు. ఈ మొత్తానికి అసలుతో పాటు రూ.50వేలు వడ్డీ కూడా చెల్లించినట్లు ఆమె చెప్పారు. మహేంద్రుకు వడ్డీతో సహా అప్పు మొత్తం తీర్చేశానని తెలిపారు. శనివారం రాత్రి ఇంకా రూ.65 వేలు వడ్డీ డబ్బులు చెల్లించాలంటూ యువకులతో కలిసివైసీపీ నేత దాడిచేయించాడని పార్వతి ఆరోపించారు. చేసేదేమీ లేక ఫిర్యాదు చేయడానికి పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లగా అక్కడ పోలీసులు పట్టించుకోలేదన్నారు.

దీంతో పోలీస్ స్టేషన్ వద్దే పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్టు బాధితురాలు చెప్పారు. వెంటనే పోలీసులు ఆమెను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం ప్రైవేట్‌ ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఆసుపత్రిలోనే పార్వతికి చికిత్స కొనసాగుతోంది. ఈ విషయం గురించి మీడియా బాధితురాలిని ప్రశ్నించగా.. ‘‘నన్ను ఎవరూ ఏమీ చేయలేరూ, పోలీసులు కూడా మేం చెప్పినట్లే వింటారు. నీకు దిక్కున్న చోట చెప్పుకోమని మహేంద్రు చితకబాదారు’’ అని బోరున విలపించారు. ఈ మేరకు ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్‌లో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

టీడీపీ సానుభూతిపరులపై వైసీపీ నేతలు దాడి:పల్నాడు జిల్లాలో టీడీపీ సానుభూతిపరులపై వైసీపీ నేతలు దాడికి పాల్పడ్డారు. శావల్యాపురం మండలం మత్తుకుమల్లిలో పచ్చవ సూర్యనారాయణతో పాటు కుటుంబ సభ్యులపై గ్రామ మాజీ సర్పంచ్ వైసీపీ నాయకులు చింతల వెంకటేశ్వర్లు కుమారుడు దాడి చేశారు. పొలం వివాదానికి సంబంధించి వేసిన కోర్టు కేసును వెనక్కు తీసుకోవాలని బెదిరించగా.. సూర్యనారాయణ కుటుంబం నిరాకరించడంతో దాడి చేసి గాయపరచారు. సూర్యనారాయణ ప్రస్తుతం వినుకొండ ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు. అధికార పార్టీకి చెందినవారు కావడంతో పోలీసులు కేసు నమోదు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని బాధితులు ఆరోపించారు. దీనిపై పోలీసులను అడగ్గా.. చట్ట ప్రకారం ఏం చేయాలో అది చేస్తామని సమాధానమిచ్చారు.

అకారణంగా 10 నుండి 15 మంది వైసీపీ నాయకులు ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు అండదండలతో తమపై మాజీ సర్పంచ్ వైసీపీ నాయకులు చింతల వెంకటేశ్వర్లు కుమారుడు బ్రహ్మయ్య మరికొందరు దాడి చేసి ఆస్తులను ధ్వంసం చేసి పొలం వివాదానికి సంబంధించి వేసిన కోర్టు కేసును వెనక్కు తీసుకోవాలని బెదిరించతామే కాకుండా తమ ఇంట్లో ఉన్న నగదు కూడా తీసుకొని వెళ్లడం జరిగిందని బాధితుడు పచ్చవ సూర్యనారాయణ తెలియజేశారు. తమకు గ్రామంలో వైసిపి నాయకులు నుండి ప్రాణహాని ఉందని, పోలీసులకు ఎన్నిసార్లు దీనిపై ఫిర్యాదులు చేసిన ఎమ్మెల్యే అండదండలతో తమపై తప్పుడు కేసులు నమోదు చేస్తూమానసికంగా హింసిస్తున్నారని పోలీస్ స్టేషన్లో పోలీసులు తమపై దాడి చేస్తున్నారని తామను రక్షించాలని వేడుకొన్నారు.

Last Updated : Jun 19, 2023, 6:41 AM IST

ABOUT THE AUTHOR

...view details