ఆంధ్రప్రదేశ్

andhra pradesh

తల్లి పులి జాడ కోసం అన్వేషణ.. రంగంలోకి 300 మంది సిబ్బంది

By

Published : Mar 8, 2023, 10:58 PM IST

The lost tiger cubs
The lost tiger cubs ()

The lost tiger cubs updates: నంద్యాల జిల్లాలో మూడు రోజులక్రితం తప్పిపోయిన పులి పిల్లలను తల్లి వద్దకు చేర్చేందుకు 300 అధికారులు, సిబ్బంది తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. తల్లి జాడ కోసం మూడు రోజులుగా గాలింపు చర్యలు చేపట్టారు. ముసలిమడుగు గ్రామ సమీపంలో పులిని చూశామని కొంతమంది పశువుల కాపరులు తెలియజేయడంతో.. అటవీశాఖ అధికారులు పులి జాడను అతి త్వరలోనే గుర్తించి.. తప్పిపోయిన ఆ పులి పిల్లలను వాటి తల్లి వద్దకు చేర్చుతామని అన్నారు.

తప్పిపోయిన పులి పిల్లలు.. గాలింపు చేపట్టిన 300మంది అధికారులు

The lost tiger cubs updates: మూడు రోజుల క్రితం దారి తప్పిన నాలుగు పులి పిల్లలను స్థానికులు అటవీశాఖ అధికారులకు అప్పగించిన విషయం తెలిసిందే. దీంతో ఆ పులి పిల్లల తల్లి జాడను కనిపెట్టి, పెద్దపులి చెంతకు చేర్చడమే లక్ష్యంగా ముందుకు సాగుతామని అధికారులు వెల్లడించారు. ఆ మాట ప్రకారమే.. దాదాపు 300 మంది అధికారులు, సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో మూడు రోజులక్రితం కనిపించకుండాపోయిన తల్లి జాడను.. పలువురు పశువులు కాసే కాపరులు గుర్తించారు. దీంతో ఆ పులి అడుగు జాడలను త్వరలోనే కనిపెట్టి పులి వద్దకు పిల్లలను చేర్చుతామని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

వివరాల్లోకి వెళ్తే.. నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలం పెద్దగుమ్మడాపురం గ్రామ సమీపంలో మూడు రోజులక్రితం దారి తప్పిన నాలుగు పులి పిల్లలను స్థానికులు గుర్తించి అటవీశాఖ అధికారులకు అప్పగించారు. లభ్యమైన ఆ పులి పిల్లల విషయంలో వాటిని తన తల్లి చెంతకు చేర్చడమే లక్ష్యంగా చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. ఆ ప్రకారమే తప్పిపోయిన ఆ పులి పిల్లలను తన తల్లి వద్దకు చేర్చేందుకు దాదాపు 300 మంది సిబ్బందితో నేడు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో మూడు రోజులక్రితం కనిపించకుండాపోయిన ఆ పులి పిల్లల తల్లి జాడ నేడు తెలియటంతో త్వరలోనే పులి వద్దకు పిల్లలను చేర్చుతామని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు.

గుమ్మడాపురం గ్రామం నల్లమల అటవీ ప్రాంతానికి సమీపంలో ఉంటుంది. ఈ నెల ఆరవ తేదీన దారి తప్పిన నాలుగు పులి పిల్లలను స్థానికులు గుర్తించి.. అటవీ అధికారులకు అప్పగించారు. అధికారులు వాటిని బైర్లూటి అటవీ శాఖ కేంద్రానికి తరలించి.. వైద్య పరీక్షలు నిర్వహించారు. అందులో నాలుగు ఆడ పులి పిల్లలు సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నాయని తేల్చారు. వీటిని ఎలాగైనా తల్లి పులి వద్దకు చేర్చాలని అధికారులు నిర్ణయించారు. అందులో భాగంగా అటవీ ప్రాంతంలో పులి జాడ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కొత్తపల్లి, ఆత్మకూరు మండలాల పరిధిలోని నల్లమల అటవీ ప్రాంతంలో 40 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. మూడు వందల మంది సిబ్బందితో గాలింపు చేపట్టారు. పులి జాడ కోసం అన్వేషణ కొనసాగిస్తున్నారు.

ఈ నేపథ్యంలో కొత్తపల్లి మండలం ముసలిమడుగు సమీపంలో పులి కనిపించిందని.. గొర్రెల కాపరులు తెలిపారు. దీంతో ఈ ప్రాంతంలో అటవీ సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టి.. పులి అడుగులను గుర్తించారు. అవి ఖచ్చితంగా పులివేనని నిర్ధారించారు. అయితే, అవి తల్లి పులి జాడలా, లేదంటే మగ పులి అడుగులా అనేదానిపై అధికారులు పరిశీలిస్తున్నారు. అవి తల్లి పులివే అయితే.. ఈ ప్రాంతంలోనే పిల్లలను కలిపేందుకు చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. సాధ్యమైనంత త్వరగా తల్లి పులితో పిల్లలను కలిపేందుకు చర్యలు తీసుకుంటున్నారు. పిల్లలను కోల్పోయిన తల్లి ఆగ్రహంగా ఉంటుందని, గ్రామస్థులు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఇవీ చదవండి

ABOUT THE AUTHOR

...view details