జగ్గయ్యపేటలో ముంబయి పోలీసులు.. ఆ నలుగురు పిల్లలు ఎక్కడ..?

author img

By

Published : Mar 8, 2023, 7:42 PM IST

mumbai

Mumbai police conducted searches in Jaggaiyapet: మహారాష్ట్ర పోలీసుల తనిఖీలతో ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట ప్రాంతంలో ఒక్కసారిగా కలకలం రేగింది. ఇటీవలే ముంబయిలో కిడ్నాప్‌ అయిన బాలుడి కేసును ఛేదించిన పోలీసులు.. మరోసారి సోదాలు చేపట్టడంతో స్థానికులు ఆందోళనకు గురవుతున్నారు. ముంబయికి చెందిన మరో నలుగురు పిల్లలను విజయవాడకు చెందిన శ్రావణి జగ్గయ్యపేటలోని శిల్పకి విక్రయించారని, ఆ నలుగురు పిల్లలు జగ్గయ్యపేట ప్రాంతంలోనే ఉన్నట్టుగా తమకు సమాచారం అందిందని ముంబాయి పోలీసులు తెలిపారు. తనిఖీలు చేపట్టిన అధికారులు.. దేచుపాలెంలో ఇద్దరు పిల్లలు లభ్యమయ్యారని, మరో ఇద్దరి కోసం గాలిస్తున్నట్టు పేర్కొన్నారు.

Mumbai police conducted searches in Jaggaiyapet: మహారాష్ట్ర పోలీసుల తనిఖీలతో ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట ప్రాంతంలో ఒక్కసారిగా కలకలం రేగింది. ఇటీవలే ముంబయిలో కిడ్నాప్‌ అయిన బాలుడి కేసును ఛేదించిన పోలీసులు.. మరోసారి సోదాలు చేపట్టడంతో స్థానికులు ఆందోళనకు గురవుతున్నారు. ముంబయికి చెందిన మరో నలుగురు పిల్లలను విజయవాడకు చెందిన శ్రావణి.. జగ్గయ్యపేటలోని శిల్పకి విక్రయించిందని, ఇప్పుడు ఆ నలుగురు పిల్లలు జగ్గయ్యపేట ప్రాంతంలోనే ఉన్నట్టుగా తమకు సమాచారం అందిందని ముంబయి పోలీసులు తెలిపారు. తనిఖీలు చేపట్టిన అధికారులు.. దేచుపాలెంలో ఇద్దరు పిల్లలు లభ్యమయ్యారని, మరో ఇద్దరి కోసం గాలిస్తున్నామని పేర్కొన్నారు.

ముంబయి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ముంబయికి చెందిన మరో నలుగురు పిల్లలు జగ్గయ్యపేట పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్నారని మాకు సమాచారం అందింది. ఆ సమాచారం అందిన వెంటనే ఇక్కడి స్థానిక పోలీసులకు ఫోన్ చేసి తెలుసుకుని, ఈరోజు జగ్గయ్యపేటకు వచ్చాం. ముంబయిలో కిడ్నాప్​నకు​ గురైన ఐదుగురు పిల్లలు విజయవాడకు చెందిన శ్రావణి.. జగ్గయ్యపేట శిల్పకి అమ్మడం జరిగింది. ఇప్పటికే ఇద్దరు మగ పిల్లల్ని స్వాధీనం చేసుకున్నాం. జగ్గయ్యపేట బ్రాహ్మణ బజారులో ఒక పిల్లవాడు ఉన్నట్టుగా గుర్తించాం. మరో పిల్లవాడు విస్సన్నపేటలో ఉన్నాడని సమాచారం తెలిసింది. వారికోసం ఇంకా తనిఖీలు జరుగుతున్నాయి'' అని తెలిపారు.

అసలు ఏం జరిగిందంటే: ఏడాది క్రితం ముంబయికి చెందిన ఒక బాలుడు కిడ్నాప్‌ అయ్యాడు. తల్లిదండ్రుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. సంవత్సరం తర్వాత ఆ బాలుడు ఎన్టీఆర్‌ జిల్లా జగ్గయ్యపేట ప్రాంతంలోని దేచుపాలెం గ్రామంలో దొరికినట్టు తెలిపారు. అదే తరహాలో ముంబయికి చెందిన మరో నలుగురు పిల్లలు జగ్గయ్యపేట ప్రాంతంలో ఉన్నట్టు వారికి సమాచారమందడంతో మరోసారి ముంబయి పోలీసులు జగ్గయ్యపేటకు చేరుకున్నారు.

ఈ క్రమంలో స్థానిక పోలీసుల సాయంతో కిడ్నాపైన పిల్లలు జగ్గయ్యపేట ప్రాంతంలోనే ఉన్నట్టు తెలుసుకున్నారు. ముంబయిలో కిడ్నాప్‌ అయిన ఐదుగురు పిల్లలను విజయవాడకు చెందిన శ్రావణి అనే మహిళ జగ్గయ్యపేట శిల్పకి విక్రయించారని, జగ్గయ్యపేటలోనే ఆ నలుగురు పిల్లల్ని శ్రావణి అమ్మేసిందని ముంబయి పోలీసులు చెబుతున్నారు. ఇద్దరు పిల్లలు ఇప్పటికే వత్సవాయి మండలం దేచుపాలెంలో లభ్యమవ్వగా.. వారిని అదుపులోకి తీసుకున్నామన్నారు. మరో బాలుడు జగ్గయ్యపేట బ్రాహ్మణ బజారులో ఉన్నాడని పోలీసులు గుర్తించారు. విస్సన్నపేట, జగ్గయ్యపేటలో ఉన్న ఇద్దరు చిన్నారుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

ఈ ఘటన ఎలా వెలుగులోకి వచ్చిందంటే: 2022వ సంవత్సరం ఫిబ్రవరి నెలలో ఒక బాలుడు అదృశ్యమయ్యాడు. బాలుడు ఆచూకీ కోసం విచారణ చేపట్టిన మహారాష్ట్ర పోలీసులు.. ఏపీలోని విజయవాడకు చెందిన ఓ మహిళ ఆ బాలుడిని తీసుకెళ్లినట్లు విచారణలో గుర్తించారు. బాలుడిని తీసుకెళ్లిన ఆ మహిళ రూ.2 లక్షలకు జగ్గయ్యపేటలోని మరో మహిళకు అమ్మగా.. ఆమె దేచుపాలెంలో ఉన్న బంధువులకు రూ.3 లక్షలకు ఆ బాలుడిని ఇచ్చేసింది. అప్పటినుంచి అదే కుటుంబంలో పెరుగుతున్న ఆ బాలుడు.. జగ్గయ్యపేటలోని ఓ ప్రైవేటు పాఠశాలలో చదివిస్తున్నారు. ఈ క్రమంలో జగ్గయ్యపేటలోని మార్కెట్‌ యార్డ్‌లో పాఠశాల వార్షికోత్సవం జరుగుతుండగా.. స్థానిక పోలీసులతో కలిసి మహారాష్ట్ర పోలీసులు మార్కెట్ యార్డ్‌కు విచ్చేశారు. కిడ్నాప్​నకు సంబంధిత పక్క ఆధారాలు, కేసు పత్రాలను చూపి ఆ బాలుడిని ముంబయికి తీసుకెళ్లిపోయారు.

ఇవీ చదవండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.