ఆంధ్రప్రదేశ్

andhra pradesh

నల్లమల అడవిలో పెద్దపులి సంచారం..

By

Published : Nov 4, 2022, 7:38 PM IST

Tiger crossing the road in Srisailam: రాష్ట్రంలోని నల్లమల అడవిలో పెద్దపులి సంచరిస్తోంది. రోడ్డు దాటుతున్న పెద్దపులిని పలువురు ప్రయాణికులు తమ సెల్​ఫోన్లలో చిత్రీకరించారు. పెద్దపులి పగటిపూట రోడ్డు దాటుతూ వాహనదారులకు కనిపించింది. శ్రీశైలం వైపు వాహనాల్లో వెళ్తున్న యాత్రికులు రోడ్డు దాటుతున్న పెద్ద పులి దృశ్యాలను తమ సెల్​ఫోన్​లో చిత్రీకరించారు.

రోడ్డు దాటుతున్న పెద్దపులి
Tiger crossing the road

నల్లమల అడవిలో పెద్దపులి సంచారం

Tiger crossing the road in Srisailam: నల్లమల అడవుల్లో శ్రీశైలం వెళ్లే దారిలో వాహనదారులకు పెద్దపులి కనిపించింది. ప్రకాశం జిల్లా దోర్నాల మండలం చింతల - తుమ్మలబైలు ఘాట్​లో ఈ రోజు ఉదయం పెద్దపులి రహదారి దాటుతూ వాహనదారులకు కనిపించింది. దోర్నాల నుంచి శ్రీశైలం వైపు వాహనాల్లో యాత్రికులు వస్తుండగా పెద్దపులి రోడ్డు దాటుతుండగా వారు సెల్​ఫోన్లలో చిత్రీకరించారు. పెద్దపులిని చూసి ఆశ్చర్యచకితులయ్యామని వారు తెలిపారు. చలికాలం కావడంతో పెద్దపులి బయటకు వస్తుంటుందని అటవీ శాఖ అధికారులు తెలిపారు. గత ఏడాది ఇదే సీజన్లో పెద్దపులి శ్రీశైలం సమీప సాక్షి గణపతి సమీపంలో యాత్రికులకు కనిపించింది. పెద్ద పులులు తరచూ కనిపించడం పులుల పెరుగుతుందన్న వాదనకు బలం చేకూరుస్తోంది.

ABOUT THE AUTHOR

...view details