ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Rains: భారీ వర్షాలతో తీరని పంట నష్టం

By

Published : Nov 24, 2021, 7:18 AM IST

భారీ వర్షాలతో తీరని పంట నష్టం
భారీ వర్షాలతో తీరని పంట నష్టం

అప్పో సొప్పో చేసి సాగు చేస్తే....నాలుగు రాళ్లు మిగలకపోతాయా అని నమ్మారు..! విత్తు వేసినప్పటి నుంచి..పంటరక్షణకు సర్వశక్తులూ ఒడ్డారు..! తీరా చేతికొస్తుందనుకునే సమయానికి...వరుణుడు దెబ్బకొట్టాడు. అన్నదాతలను నిండా ముంచాడు.

భారీ వర్షాలతో తీరని పంట నష్టం

కర్నూలు, నెల్లూరు జిల్లాల్లో రైతులకు భారీ వర్షాలు తీవ్ర నష్టం మిగిల్చాయి. కర్నూలు జిల్లాలో 3 లక్షల 20 వేల హెక్టార్లలో రబీ సాధారణ సాగు చేయాల్సి ఉండగా ఇప్పటివరకు లక్షకుపైగా హెక్టార్లలో పంట వేశారు. అందులో ప్రధానంగా..కోవెలకుంట్ల, ఆలూరు, హోలగుంద, సంజమాల, కోడుమూరు, నందికొట్కూరులో అత్యధికంగా శనగ సాగైంది. 15 రోజులుగా కురుస్తున్న వర్షాలతో పంట పూర్తిగా దెబ్బతింది. జిల్లాలో సుమారు లక్షా 24 వేల 367 ఎకరాల్లో శనగ దెబ్బతిన్నట్లు వ్యవసాయ అధికారుల లెక్కలేశారు. ఎకరాకు 15 వేలు పెట్టుబడి చొప్పున 186 కోట్ల 55 లక్షల పెట్టుబడి నష్టం వాటిల్లిందని తేల్చారు.

ఖరీఫ్‌లో దెబ్బతిన్న తమకు రబీలోనూ ఎదురైన నష్టంతో.....ఇప్పుడిప్పుడే కోలుకోవడం కష్టమని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నెల్లూరు జిల్లాలో కోతకు గురైన పొలాల్లో..ఎటుచూసినా ఇసుక మేటలే కనిపిస్తున్నాయి. రొయ్యల చెరువులు పూర్తిగా మునిగాయి. ఇందుకూరుపేట, కోవూరు, బుచ్చిరెడ్డిపాలెం మండలాల్లో వందలాది ఎకరాల్లో చేపలు మృతి చెందాయి. ఇంతనష్టం జరిగితే...అధికారులు పరిశీలనకు రాలేదని....దామరమడుగు రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ చదవండి:'పెద్దవాగు మినహా మిగతా ప్రాజెక్టుల స్వాధీనం అక్కర్లేదు'

ABOUT THE AUTHOR

...view details