ఆంధ్రప్రదేశ్

andhra pradesh

నేడు కర్నూలుకు.. 'సర్కారు వారి పాట' చిత్ర బృందం

By

Published : May 16, 2022, 4:40 AM IST

Updated : May 16, 2022, 5:56 AM IST

Sarkaru Vaari Paata Movie Team at kurnool: 'సర్కారు వారి పాట' సినిమా విజయోత్సవ వేడుకలను నేడు కర్నూలులో ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈవేడుకల్లో హీరో మహేశ్​బాబుతో పాటు చిత్ర బృందం పాల్గొంటుందని మహేశ్​బాబు అభిమానులు తెలిపారు.

Sarkaru Vaari Paata victory celebrations in Kurnool
నేడు కర్నూలుకు.. 'సర్కారు వారి పాట' చిత్ర బృందం

మహేశ్​బాబు, కీర్తి సురేశ్​ జంటగా నటించిన 'సర్కారు వారి పాట' సినిమా విజయోత్సవ వేడుకలను నేడు కర్నూలులో ఘనంగా నిర్వహిస్తున్నట్లు మహేశ్​బాబు అభిమానులు తెలిపారు. ఈ వేడుకల్లో పాల్గొనేందుకు హీరో మహేశ్​బాబుతోపాటు చిత్ర బృందం కర్నూలుకు వస్తున్నట్లు చెప్పారు. ఇవాళ సాయంత్రం కర్నూలులోని ఎస్టీబీసీ కళాశాల మైదానంలో ఈ వేడుకలు జరుగుతాయని తెలిపారు. కర్నూలులో సర్కారు వారి పాట సినిమా.. ఒక కోటి ఇరవై లక్షల రూపాయలను నాలుగు రోజుల్లో వసూలు చేసినందున మహేశ్‌ అభిమానులు కేక్ కట్ చేసి సంబురాలు చేసుకున్నారు.

Last Updated :May 16, 2022, 5:56 AM IST

ABOUT THE AUTHOR

...view details