ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ఏసీబీకి చిక్కిన విద్యుత్ శాఖ​ ఏఈ

By

Published : Jan 7, 2020, 7:33 PM IST

కర్నూలు జిల్లా పగడాల మండలం విద్యుత్ శాఖ ఏఈ వెంకటేశ్వర్లు ఏసీబీకి చిక్కారు. లక్ష్మాపురం గ్రామానికి చెందిన చంద్రమోహన్ అనే రైతు పొలంలో బోర్లకు అనుమతి ఇచ్చేందుకు రూ.30 వేలు లంచం డిమాండ్​ చేశారు. చివరకు రూ.20 వేలు ఇచ్చేందుకు రైతు ఒప్పందం చేసుకొని దీనిపై ఏసీబీ డీఎస్పీ నాగభూషణంకు ఫిర్యాదు చేశాడు. దీనిపై స్పందించిన ఏసీబీ అధికారులు కెమికల్​ నోట్లను రైతుకు ఇచ్చారు. వాటిని అతని వద్ద నుంచి ఏఈ తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్​గా పట్టుకున్నారు. అవినీతి రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ తమకు సహకరించాలని ఏసీబీ డీఎస్పీ కోరారు.

power department officer AE in the ACB trap
ఏసీబీ వలలో మరో విద్యుత్ శాఖ అధికారి

ఏసీబీకి చిక్కిన విద్యుత్ శాఖ​ ఏఈ

ఇవీ చూడండి...

Intro:కర్నూలు జిల్లా పగడాల మండలం విద్యుత్ శాఖలో పని చేస్తున్న ఏఈ వెంకటేశ్వర్లు ఏసీబీకి చిక్కారు. లక్ష్మాపురం గ్రామానికి చెందిన చంద్రమోహన్ అనే రైతు తనకున్న ఆరు ఎకరాల 78 సెంట్ల విస్తీర్ణం గల పొలంలో మూడు బోర్లకు అనుమతి కోసం దరఖాస్తు చేసుకున్నారు. గత ఏడాది నాలుగు నెలల్లో దరఖాస్తు చేసుకోగా సంబంధిత శాఖ ఏఈ వెంకటేశ్వర్లు డబ్బులు డిమాండ్ చేశారు. రూ .30,000 డిమాండ్ చేయగా లంచం ఇచ్చేందుకు ఇష్టం లేక మతిమాలిన ఏఈ ఒప్పుకోకపోవడంతో రూ .20,000 ఇచ్చేందుకు రైతు ఒప్పుకొన్నారు. ఈ విషయమై కర్నూల్ ఏసీబీ డి.ఎస్.పి నాగభూషణం కలిశారు. వారు ఇచ్చిన కెమికల్ నోట్లను తీసుకువచ్చి విద్యుత్ శాఖ ఏఈ వెంకటేశ్వర్ల కు ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. విద్యుత్ శాఖలో అవినీతి పేరుకుపోయిందని, అధికారులు రైతులను సతాయిస్తున్న ట్లు తమ దృష్టికి వచ్చిందని డీఎస్పీ నాగభూషణం తెలిపారు అవినీతిని ప్రోత్సహించ కుండా అవినీతి రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ తమకు సహకరించాలని కోరారు.


Body:ss


Conclusion:ss

TAGGED:

ABOUT THE AUTHOR

...view details