ఆంధ్రప్రదేశ్

andhra pradesh

కర్నూలు సరిహద్దులో అనుమతి నిరాకరణ.. వెనుదిరిగిన అంబులెన్స్!

By

Published : May 10, 2021, 7:39 PM IST

రాష్ట్రం నుంచి హైదరాబాద్ కు చికిత్స నిమిత్తం కొవిడ్ రోగిని తీసుకెళ్తున్న అంబులెన్స్​ను పోలీసులు అడ్డుకున్నారు. ఎంత సమయం వేచి చూసినా.. తెలంగాణలోకి వెళ్లేందుకు పోలీసులు అనుమతి నిరాకరించిన కారణంగా.. బాధితులు వెనుతిరిగారు.

సరిహద్దులో అంబులెన్స్​ను అడ్డుకున్న పోలీసులు
సరిహద్దులో అంబులెన్స్​ను అడ్డుకున్న పోలీసులు

తెలంగాణ సరిహద్దు టోల్ గేట్ వద్ద.. కర్నూలు జిల్లాకు చెందిన కరోనా బాధితుడి అంబులెన్స్​ను తెలంగాణ పోలీసులు అడ్డుకున్నారు. రాష్ట్రం నుంచి హైదరాబాద్ కు చికిత్స నిమిత్తం వెళ్తుండగా.. పోలీసులు తెలంగాణలోకి వెళ్లేందుకు అనుమతి నిరాకరించారు.

కడప జిల్లా మైదుకూరు నుంచి అంబులెన్స్​లో బాధితులు హైదరాబాద్ కు వెళ్తుండగా పోలీసులు నిలిపివేశారు. పేషేంట్ పరిస్థితి విషమంగా ఉందని.. హైదరాబాద్ లోని ఆసుపత్రిలో చికిత్స కోసం బెడ్ సైతం మాట్లాడి పెట్టుకున్నామని బాధితులు వాపోయారు. అయినప్పటికీ పోలీసులు అనుమతి ఇవ్వలేదంటు ఆవేదన వ్యక్తం చేశారు. గంటలు పాటు వేచి చుసినా అనుమతి ఇవ్వని కారణంగా.. వెనక్కు వెళ్లారు.

ABOUT THE AUTHOR

...view details