ఆంధ్రప్రదేశ్

andhra pradesh

రేపటి నుంచి శ్రీశైలంలో దసరా మహోత్సవాలు

By

Published : Oct 16, 2020, 6:03 PM IST

రేపటి నుంచి శ్రీశైలంలో దసరా మహోత్సవాలు ప్రారంభం కానున్నట్లు ఆలయ ఈవో రామారావు స్పష్టం చేశారు. ఈనెల 24న ప్రభుత్వం తరపున మంత్రి జయరాం పట్టువస్త్రాలు సమర్పిస్తారని తెలిపారు.

రేపటి నుంచి శ్రీశైలంలో దసరా మహోత్సవాలు
రేపటి నుంచి శ్రీశైలంలో దసరా మహోత్సవాలు

శనివారం నుంచి శ్రీశైలంలో దసరా మహోత్సవాలు ప్రారంభంకానున్నట్లు ఆలయ ఈవో రామారావు స్పష్టం చేశారు. రేపు ఉదయం 8 గంటల 30 నిమిషాలకు ఉత్సవాలకు అంకురార్పణ జరగనున్నట్లు తెలిపారు. ఈనెల 18 నుంచి 24 వరకు లోక కల్యాణార్ధం విశేష పూజలు నిర్వహిస్తామన్నారు. ప్రభుత్వం తరపున కార్మికశాఖ మంత్రి జయరాం ఈనెల 24 పట్టువస్త్రాలు సమర్పిస్తారని ఈవో వెల్లడించారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ ఉత్సవాలు నిర్వహిస్తామన్న ఆయన...భక్తులు క్యూలైన్లలో భౌతిక దూరం పాటించాలని సూచించారు.

ABOUT THE AUTHOR

...view details