ఆంధ్రప్రదేశ్

andhra pradesh

COUPLE SUICIDE: కరోనా వేళ.. అప్పుల బాధ భరించలేక..

By

Published : Aug 16, 2021, 9:38 AM IST

కరోనాతో అప్పులు భరించలేక దంపతులు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కర్నూలు జిల్లాలో జరిగింది. ఓవైపు పాఠశాల నడవక.. మరోవైపు తీసుకున్న అప్పు తీర్చాలని వడ్డీకి ఇచ్చిన వాళ్లు వేధించడం వల్ల ఆత్మహత్యకు పాల్పడ్డారు. చనిపోతున్న చివరి నిమిషంలో తీసిన సెల్ఫీ వీడియోతో ఈ ఘోరం వెలుగుచూసింది.

suicide
suicide

కర్నూలు జిల్లా కోవెలకుంట్ల పట్టణానికి చెందిన లైఫ్ ఎనర్జీ అనే పాఠశాల నిర్వాహకులు విషగుళికలు మింగి ఆత్మహత్య చేసుకున్నారు. వీరిద్దరు భార్యభర్తలు.. ఆత్మకూరు సమీపంలో ఆత్మహత్యకు పాల్పడగా సుబ్రమణ్యం ,భార్య రోహిణిలను కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందారు.

కర్నూలు జిల్లా కోవెలకుంట్ల పట్టణానికి చెందిన సుబ్రమణ్యం భార్య రోహిణి లైఫ్ ఎనర్జీ అనే పాఠశాల నిర్వహిస్తున్నారు. కరోనా కారణంగా గత కొంత కాలంగా పాఠశాలలు సరిగా నడవక అప్పులపాలు అయినట్లు తెలుస్తోంది. పోలీసులు పూర్తి సమాచారాన్ని సేకరిస్తున్నారు.

దంపతుల ఆత్మహత్య..

ఆసుపత్రికి తరలిస్తున్న సమయంలో కొన ఊపిరితో ఉన్న సుబ్రమణ్యం చివరి నిముషంలో ఒక సెల్ఫీ వీడియోని తీసాడు. అందులో తన బాదని వెల్లకక్కాడు. కరోనా నేపథ్యంలో పాఠశాలలు సరిగా నడవక అప్పులపాలు అయ్యానని..సునీల్ ,సుమన్ సింగ్ అనే వ్యక్తులు తీసుకున్న అప్పు ఇవ్వాలని తీవ్రంగా ఒత్తిడి తీసుకురావడంతో ఇలా చేయక తప్పలేదని చెప్పాడు.

పాఠశాల నిర్వాహకులు, అందులోను భార్యాభర్తలు ఆత్మహత్య చేసుకోవడం స్థానికంగా కలకలం రేపింది. వీరికి సంతానం లేనట్టు బంధువులు వెల్లడించారు.పోలీసులు అన్ని కోణాల్లో విచారణ చేస్తున్నామని తెలిపారు.

ఇదీ చదవండి:Schools Reopen: నేటినుంచే రాష్ట్రంలో పాఠశాలల పునఃప్రారంభం

ABOUT THE AUTHOR

...view details