ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ఏ సమస్యకు పరిష్కారం దొరకటం లేదు..! కృష్ణాజిల్లా పరిషత్​ సర్వసభ్య సమావేశంలో జడ్పీటీసీలు

By

Published : Feb 25, 2023, 8:38 PM IST

ZP General Body Meeting : కృష్ణాజిల్లా సర్వసభ్య సమావేశంలోని సభ్యులు అసంతృప్తికి గురయ్యారు. ఎన్ని రోజులుగా వేచి చూసినా ఫలితం దక్కటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే..

ZP General Body Meeting
! కృష్ణాజిల్లా పరిషత్​ సర్వసభ్య సమావేశం

ఎలక్షన్లలో విజయం సాధించినప్పటి నుంచి నేటి వరకు ఏ సమస్య పరిష్కారం కాలేదని.. ఒకరు, ఎన్ని సార్లు మొరపెట్టుకున్న పరిష్కారమే దొరకటం లేదని మరొకరు.. ఇలా జిల్లాలోని పలువురు జడ్పీటీసీ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కృష్ణాజిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో సమస్యలు పరిష్కారం కావటం లేదని.. పలువురు సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. సకాలంలో నిధులు విడుదల చేయకపోవడం వల్ల నాడు నేడు కింద చేపట్టిన పనులు నిలిచిపోతున్నాయని.. కృష్ణా జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో వారి పరిధిలోని సమస్యలను లేవనెత్తిన కూడా.. వాటికి పరిష్కారం దొరకటం లేదని కొందరు జడ్పీటీసీ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్యల పరిష్కార విషయంలో ఏ ఒక్క సభ్యుడు సంతృప్తిగా లేరని ముసునూరు జడ్పీటీసీ సభ్యుడు అన్నారు. గెలిచి జడ్పీటీసీ సభ్యునిగా అధికారం చేపట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు.. ఏ సమస్యకు పరిష్కారం లభించలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

నూతనంగా నిర్మించిన అంగన్​వాడీ కేంద్రంలో గొర్రెలు తోలుతున్నారని చెప్పినా.. ఆ సమస్యను పరిష్కరించటం లేదన్నారు. ఈ సమస్యను పరిష్కరిస్తామని మంత్రి జోగి రమేశ్​ హామీ ఇచ్చారని ఆయన అన్నారు. అయినప్పటికీ సమస్య అలాగే ఉందని తెలిపారు. కార్పొరేట్​ ఆసుపత్రులు పేద రోగులకు ఆరోగ్య శ్రీ వర్తించకుండా చేస్తున్నాయని నూజివీడు ఎమ్మెల్యే మేక వెంకట ప్రతాప్ అప్పారావు ఆరోపించారు. మొదట ఆసుపత్రులకు బిల్లులు చెల్లించి తర్వాత.. నగదు కోసం దరఖాస్తు చేసుకుంటే ప్రభుత్వం నుంచి అందటం లేదన్నారు. గతంలో నిర్వహించిన సమావేశంలో అవనిగడ్డ గాంధీ క్షేత్రానికి సంబంధించిన సమస్యను సైతం పరిష్కరించలేదని ఎమ్మెల్యే సింహాద్రి రమేశ్ బాబు గుర్తు చేశారు.

ఇవీ చదవండి :

ABOUT THE AUTHOR

...view details