ఆంధ్రప్రదేశ్

andhra pradesh

yanamala: ప్రభుత్వం, పోలీసుల ప్రోత్సాహంతోనే విధ్వంస కాండ: యనమల

By

Published : Oct 20, 2021, 11:37 AM IST

రాష్ట్రంలో పార్టీ కార్యాలయాలకు, నాయకులకు రక్షణ లేకుండా పోయిందని తెదేపా సీనియర్ నేత యనమల రామకృష్ణుడు మండిపడ్డారు. ప్రభుత్వం, పోలీసుల ప్రోత్సాహంతోనే వైకాపా విధ్వంస కాండకు పాల్పడిందని ఆరోపించారు.ఫాక్షనిస్ట్ పాలనకు ఇది పరాకాష్ట అన్నారు. కేంద్రం తక్షణమే స్పందించి..రాష్ట్రంలో పరిస్థితులు చక్కదిద్దాలని సూచించారు.

yanamala
yanamala

ప్రభుత్వం, పోలీసుల ప్రోత్సాహంతోనే వైకాపా విధ్వంస కాండకు పాల్పడిందని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు(yanamala) ఆరోపించారు. ఈ విషయంలో కేంద్రం తక్షణమే జోక్యం చేసుకోవాలని కోరారు. ఏపీలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీచేయడమే కాకుండా.. ప్రతిపక్ష పార్టీల కార్యాలయాలకు, నాయకులకు రక్షణ లేకుండా చేస్తున్నారని అన్నారు. తెలుగుదేశం కార్యాలయంపై దాడిచేస్తే.. ఇక తమనెవరూ ప్రశ్నించలేరనే అహంభావంతోనే ఈ నీచానికి దిగజారారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఫ్యాక్షనిస్టు పాలనకు ఇది పరాకాష్ట అని అన్నారు యనమల.

ఇలాంటి వైపరీత్యం దేశంలోనే ఎన్నడూలేదని.. ఏ రాష్ట్రంలోనూ చూడలేదని యనమల(yanamala) అన్నారు. ఆంధ్రప్రదేశ్‌ను గుండారాజ్‌గా మార్చారని విమర్శించారు. రాష్ట్రంలో ఆర్టికల్ 356 వినియోగం మినహా.. మరో మార్గంలేదని స్పష్టం చేశారు. కార్యాలయాలపై దాడిచేసి పార్టీల గొంతు నొక్కాలని చూస్తే.. ప్రజలే తిరగబడతారని హెచ్చరించారు. ఇటువంటి ఘాతుకానికి పాల్పడినవాళ్లను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కేంద్రం తక్షణమే స్పందించి..రాష్ట్రంలో పరిస్థితులు చక్కదిద్దాలని కోరారు.

ఇదీ చదవండి

TDP PROTEST: కృష్ణా జిల్లాలో తెదేపా నిరసనల హోరు..

ABOUT THE AUTHOR

...view details