ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Villagers And Oppositions Fire On CM Jagan Issue Of Patha Edlanka: సీఎం హామీకి ఏడాది.. వంతెన నిర్మాణం ఎప్పుడని ప్రశ్నిస్తున్న ఎడ్లంకవాసులు

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 20, 2023, 3:45 PM IST

Villagers And Oppositions Fire On CM Jagan Issue Of Patha Edlanka : పాత ఎడ్లంక వద్ద కృష్ణా నదిపై వంతెన లేకపోవడంతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. వంతెన నిర్మిస్తామని చెప్పి ఏడాది గడుస్తున్నప్పటికీ నిర్మాణ పనులు జరగడం లేదని ప్రజలు, టీడీపీ నాయకులు జలదీక్ష చేపట్టారు. నది దాటడం స్థానికులకు ప్రాణాంతకంగా మారిందని, సీఎం బూటకపు హామీలతో ప్రజలను మోసం చేస్తున్నారని.. తక్షణమే వంతెన నిర్మాణం చేపట్టాలని విపక్షాలు, గ్రామస్థులు డిమాండ్‌ చేశారు.

Patha Edlanka Bridge 2023
Villagers And Oppositions Fire On CM Jagan Issue Of Patha Edlanka

Villagers And Oppositions Fire On CM Jagan Issue Of Patha Edlanka సీఎం జగనన్న పాతరేసిన పాత ఎడ్లంక వంతెన

Villagers And Oppositions Fire On CM Jagan Issue Of Patha Edlanka : పాత ఎడ్లంక వద్ద కృష్ణా నదిపై వెంటనే వంతెన నిర్మాణం చేపట్టాలని డిమాండ్‌ చేస్తూ... కృష్ణా జిల్లా ఎడ్లంకలో గ్రామస్థులతో కలిసి తెలుగుదేశం, జనసేన నేతలు జలదీక్ష చేశారు. పాత ఎడ్లంక వద్ద కృష్ణా నదిపై వంతెన నిర్మిస్తామని గత సంవత్సరం అక్టోబర్‌ 20వ తేదీన అవనిగడ్డ సభలో సీఎం జగన్‌ హామీ ఇచ్చారు. హామీ ఇచ్చి ఏడాది గడుస్తున్నా దాని ఊసే లేకపోవడంతో ఎడ్లంక వాసులు ఆందోళన చేపట్టారు.

Patha Edlanka Bridge 2023 : అవనిగడ్డ నుంచి పాత ఎడ్లంక వెళ్లడానికి కృష్ణానదిపై నిర్మించిన కాజ్‌వే వరదలకు కొట్టుకుపోవడంతో నదిపాయ దాటడానికి గ్రామస్తులు అవస్థలు పడుతున్నారు. నడుములోతు నీటిలోనే ప్రమాదకర స్థితిలో నదిని దాటుతున్నారు.

పాత ఎడ్లంక రహదారి వంతెన నిర్మాణానికి తొమిదిన్నర కోట్ల నిధులు మంజూరు చేస్తామన్నారో అవి ఏవి. నిధులు విడుదల చేయలేదా, చేసినా మీరే వాడటం లేదా ? ప్రజల్ని ఎవరు మోసం చేస్తున్నారు. అన్యాయం ఎక్కడ జరుగుతుందో జనాలకు తెలియాలి. వెంకట్రామ్ , టీడీపీ కృష్ణాజిల్లా ఉపాధ్యక్షుడు

ఎడ్లంకి, ఎదురుమొండికి ఎన్నోసార్లు పాలాభిషేకాలు, శంకుస్థాపనలు చేశారు. వంతెన నిర్మాణం కోసం మట్టి నమూనాలు తీసుకున్నారు. ఏడాది దాటుతున్నా రోడ్లపై తీసిన గోతులు పూడ్చలేని మీరు వంతెన కడతారా? మీ విజ్ఞతకే వదిలేస్తున్నా. చిట్టిబాబు, అవనిగడ్డ

అద్దె చెల్లించొద్దు.... వ్యాపారులకు పోలీసుల ఆదేశం...

కనీసం సీఎం జగన్ ముందు మాట్లాడలేవు. నిధులు ఏవి? వంతెన నిర్మాణం ఎక్కడ జరుగుతుంది? చాతకాని శాసనసభ్యుడు రమేశ్​. ​వెంకటేశ్వరరావు, మాజీ జెడ్పీటీసీ

మాటతప్పను, మడమ తిప్పను అని చెప్పిన మాటలు సరి కాదు. ఈ వంతెన పరిస్థితి చూస్తే మీ పనితనం కనిపిస్తుంది. మాటల ముఖ్యమంత్రిలా కాకుండా చేతల సీఎంగా ఉండండి. మోసకారి, దగాకోరు సీఎం అమేమ మాటలు అక్షరాల నిజమని నిరూపించుకుంటున్నారు. వెంకటేశ్వరరావు, జనసేన నేత

ముఖ్యమంత్రి బూటకపు హామీలతో ప్రజలను మోసం చేస్తున్నారని.. తక్షణమే వంతెన నిర్మాణం చేపట్టాలని విపక్షాలు, గ్రామస్థులు డిమాండ్‌ చేశారు.

వంతెనలేక.. నదిని దాటరాక..16 గ్రామాల ఇబ్బందులు...

ABOUT THE AUTHOR

...view details