ఆంధ్రప్రదేశ్

andhra pradesh

'కరెంటు బిల్లులను ప్రభుత్వం మాఫీ చేయాలి'

By

Published : May 21, 2020, 2:02 PM IST

ఏప్రిల్, మే నెలల కరెంటు బిల్లులు ప్రభుత్వం మాఫీ చేయాలని తెదేపా నేత అయ్యన్న పాత్రుడు డిమాండ్ చేశారు. విద్యుత్ బిల్లుల పెంపుకు నిరసనగా నిరసనలు చేపడుతున్నట్లు ఆయన ప్రకటించారు.

Ayyana
Ayyana

కరోనా సాయం కింద ఏపీకి కేంద్రం వేలకోట్లు ఇస్తున్నందున.. ఏప్రిల్, మే నెలల కరెంటు బిల్లులు ప్రభుత్వం మాఫీ చేయాలని తెదేపా సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు డిమాండ్ చేశారు. జగన్​మోహన్​రెడ్డి సీఎం అయ్యాక ఏపీలో రోజుకో సమస్య వస్తోందని ఆయన దుయ్యబట్టారు. కరెంటు బిల్లులు పెంచలేదని ప్రభుత్వం అబద్దాలు చెబుతోందన్నారు. ఉపాధిలేక అల్లాడుతున్న పేద ప్రజలు కరెంటు బిల్లులు ఎలా కడతారని ప్రశ్నించారు. కరెంటు బిల్లులపై వినియోగదారులు ప్రభుత్వాన్ని నిలదీయాలని పిలుపునిచ్చారు.

ABOUT THE AUTHOR

...view details