ఆంధ్రప్రదేశ్

andhra pradesh

పురపోరు: వేడెక్కుతోన్న బెజవాడ రాజకీయం

By

Published : Feb 25, 2021, 6:17 PM IST

మున్సిపల్ ఎన్నికల వేళ విజయవాడలో రాజకీయ వాతావరణం రోజురోజుకు వేడెక్కుతోంది. ప్రచారంలో భాగంగా వైకాపా, తెదేపా వర్గాలు ఒకే రహదారిపైకి రావటంతో ఒక్కసారిగా అలజడి రేగింది. ఇరు పార్టీల మద్దతుదారులు పెద్దఎత్తున నినాదాలు చేశారు. అప్రమత్తమైన పోలీసులు ఇరు పార్టీల వారిని నియంత్రించారు.

పురపోరు: వేడెక్కుతోన్న బెజవాడ రాజకీయం
పురపోరు: వేడెక్కుతోన్న బెజవాడ రాజకీయం

విజయవాడలో నగర పాలకసంస్థ ఎన్నికల ప్రచారం జోరు క్రమంగా పెరుగుతోంది. తెదేపా, వైకాపా నేతలు ఇంటింటికి తిరిగి తమ పార్టీ అభ్యర్థినే గెలిపించాలని కోరుతున్నారు. కృష్ణలంకలోని 17వ డివిజన్​లో తెదేపా, వైకాపా నేతలు ప్రచారం నిర్వహించారు. ఇరు పార్టీల నేతలు ఒకే రహదారిపైకి రావటంతో ఉత్కంఠ వాతావరణం నెలకొంది. వైకాపా, తెదేపాకు చెందిన మద్దతుదారులు పెద్దఎత్తున నినాదాలు చేశారు. పరిస్థితి గమనించిన పోలీసులు వెంటనే అప్రమత్తమయ్యారు.

వైకాపా అభ్యర్థి తంగిరాల రామిరెడ్డి ఇంటింటికి తిరుగుతూ... కరపత్రాలు పంచుతున్నారు. ప్రజాభిమానంతో తప్పకుండా గెలుస్తామని, అందుకే తాను గెలిచిన అనంతరం ఏం చేస్తానో వివరించేందుకు మ్యానిఫెస్టోని తయారు చేసినట్లు పేర్కొన్నారు. సమస్యలపై స్థానిక ఎమ్మెల్యేతో బహిరంగ చర్చకు సిద్ధమేనని 17వ కార్పోరేషన్‌ డివిజన్‌ అభ్యర్థి రామిరెడ్డి పేర్కొన్నారు.

ఇవీ చూడండి...

తంగిరాల సౌమ్య, కుటుంబసభ్యులను పరామర్శించిన నారా లోకేశ్‌

TAGGED:

ABOUT THE AUTHOR

...view details