ఆంధ్రప్రదేశ్

andhra pradesh

'కరోనా కట్టడికే పెట్రోలు ధరలు పెంచామంటారేమో?'

By

Published : Jul 21, 2020, 3:15 PM IST

పెట్రోల్, డీజిల్ ధరల పెంపు నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కు తీసుకోవాలని నారా లోకేశ్ డిమాండ్ చేశారు. సీఎం జగన్ కరోనా కట్టడికే పెట్రోల్ ధరలు పెంచానంటారేమోని ఎద్దేవా చేశారు.

nara lokesh on petrol price hike
పెట్రోల్ ధరల పెంపుపై నారా లోకేశ్

ధరలు పెంచి మద్యనిషేధం అన్న మేధావి కరోనా కట్టడికి పెట్రోల్ ధరలు పెంచానంటారేమోని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఎద్దేవా చేశారు. కరోనా సమయంలో విద్యుత్ ఛార్జీలు ఘోరంగా పెంచి పేద ప్రజల కష్టాన్ని సీఎం జగన్ దోచుకున్నారని విమర్శించారు. వెంటనే ఆర్టీసీ చార్జీలు పెంచి, ఇప్పుడు లీటర్ పెట్రోల్ పై రూ. 1.24 పైసలు, డీజిల్ పై రూ.93 పైసలు పెంచేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పెట్రోల్, డీజిల్‍పై అదనపు వ్యాట్‍ను 4కు పెంచడం సామాన్యుల నడ్డి విరచడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. ధరలు పెంచుతూ తీసుకున్న నిర్ణయాన్ని ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details