ఆంధ్రప్రదేశ్

andhra pradesh

బందరు పోర్టు పనుల రద్దుపై.. హైకోర్టు తీర్పు రిజర్వ్

By

Published : Sep 12, 2019, 7:21 PM IST

మచిలీపట్నం పోర్టు నిర్మాణ పనుల రద్దుపై దాఖలైన పిటిషన్​ను​ హైకోర్టు విచారణకు స్వీకరించింది. ఈ వ్యాజ్యంపై ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం... తీర్పును రిజర్వ్​లో ఉంచింది.

బందరు పోర్టు పనుల రద్దుపై విచారణ పూర్తి...తీర్పు రిజర్వ్

మచిలీపట్నం పోర్టు నిర్మాణ పనుల రద్దుపై దాఖలైన వ్యాజ్యంపై హైకోర్టులో వాదనలు పూర్తయ్యాయి. పోర్టు నిర్మాణ పనుల రద్దును సవాల్ చేస్తూ నవయుగ సంస్థ వేసిన పిటిషన్​పై ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును రిజర్వ్‌లో పెట్టింది.

మచిలీపట్నం పోర్టు ఒప్పందాన్ని రద్దు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన 66వ జీవోను నవయుగ సంస్థ.. హైకోర్టులో సవాల్‌ చేసింది. ఒప్పందం ప్రకారం భూములు అప్పగించడంలో ప్రభుత్వమే విఫలమైందని పిటిషన్‌లో పేర్కొంది. ప్రభుత్వం తమను సంప్రదించకుండా ఒప్పందాన్ని ఏకపక్షంగా రద్దు చేసిందని ఆరోపించింది. పనులపై ఇప్పటికే రూ.436 కోట్లు ఖర్చుచేశామని.. ప్రభుత్వం తెచ్చిన జీవో 66 రద్దు చేయాలని వ్యాజ్యంలో కోరింది.

Intro:విద్యార్థులు ర్యాగింగ్ వంటి చట్టవ్యతిరేక చర్యల జోలికి పోవద్దని శ్రీకాకుళం ఎస్పీ ఆర్.ఎన్. అమ్మిరెడ్డి అన్నారు. టెక్కలి సమీపంలోని ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాలలో ర్యాగింగ్ వ్యతిరేక అవగాహన సదస్సులో పాల్గొని మాట్లాడారు. ర్యాగింగ్ కు పాల్పడితే విలువైన జీవితం పాడవుతుందని హెచ్చరించారు. కేసుల్లో చిక్కుకుంటే ఇంజనీరింగ్ పూర్తయ్యాక ఉద్యోగాల కోసం విదేశాలకు వెళ్లే అవకాశాన్ని కోల్పోతారన్నారు. విద్యార్థులు సత్ప్రవర్తనతో నడుచుకుని భవిష్యత్ కు పునాదులు వేసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా ఆత్మీయ నేస్తం ఫిర్యాదుల పెట్టె, ర్యాగింగ్ వ్యతిరేక కరపత్రాలు ఆవిష్కరించారు. ఎవరికైనా ఇబ్బందులు కలిగితే నిర్భయంగా ఫిర్యాదు చేయవచ్చన్నారు. కార్యక్రమంలో కాశీబుగ్గ డీఎస్పీ శివరామిరెడ్డి, కళాశాల చైర్మన్ కె.సోమేశ్వర రావు, డైరెక్టర్ వీవీ నాగేశ్వరరావు, కార్యదర్శి ఎల్.ఎల్. నాయుడు, టెక్కలి సీఐ ఆర్.నీలయ్య తదితరులు పాల్గొన్నారు.


Body:టెక్కలి


Conclusion:విక్రమ్, టెక్కలి, శ్రీకాకుళం జిల్లా
8008574284

ABOUT THE AUTHOR

...view details