ఆంధ్రప్రదేశ్

andhra pradesh

గ్యాస్ సిలిండర్ పేలి ఇళ్లు, హోటల్​ దగ్ధం

By

Published : Jun 8, 2020, 12:54 PM IST

వంట చేస్తుండగా గ్యాస్ సిలిండర్ పేలి... ఇంటితో పాటు హోటల్​ పూర్తిగా కాలిపోయింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు అదుపుచేశారు.

houses and hotel burnt in  Gas cylinder blast at rangannagudem in krishna district
houses and hotel burnt in Gas cylinder blast at rangannagudem in krishna district

కృష్ణా జిల్లా బాపులపాడు మండలం రంగన్నగూడెంలో ఓ హోటల్​​లో గ్యాస్ సిలిండర్ పేలి అగ్నిప్రమాదం జరిగింది. ఘటనలో స్థానిక కొల్లిపర సుబ్బారావుకు చెందిన ఇల్లు, హోటల్​ పూర్తిగా దగ్ధమయ్యాయి.

లాక్​డౌన్ కారణంగా హోటళ్​ మూసేసి.. ఇంట్లో అల్పాహారం తయారుచేస్తుండగా ప్రమాదం జరిగిందని బాధితురాలు తెలిపింది. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపుచేశారు. రూ. 5 లక్షల మేర ఆస్తి నష్టం వాటిల్లిందని బాధితులంటున్నారు.

ఇదీ చదవండి:కుప్పకూలిన విమానం- ప్రమాదంలో ఇద్దరు మృతి

ABOUT THE AUTHOR

...view details