ఆంధ్రప్రదేశ్

andhra pradesh

"ఆయన ఏ పదవిలో ఉన్నా.. ఏనాడూ స్నేహితులను మరిచిపోలేదు"

By

Published : Nov 8, 2022, 4:20 PM IST

Updated : Nov 8, 2022, 5:57 PM IST

EX Vice President Venkaiah Naidu Met His Friend : మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడి గురించి ఓ ఆసక్తికర విషయం వెలుగుచూసింది. ఏ పదవిలో ఉన్నా స్నేహితులకు ప్రాధాన్యం ఇస్తారని.. చెన్నైలో ఉంటున్న వెంకయ్యనాయుడి పాఠశాల ఫ్రెండ్​ నర్సారెడ్డి ఈటీవీ భారత్​కు తెలిపారు.

Ex Vice president Venkaiah Naidu met School friend in Chennai
Ex Vice president Venkaiah Naidu met School friend in Chennai

EX Vice President Venkaiah Naidu Met His Friend : ఏ పదవిలో ఉన్న మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తన స్నేహాన్ని మాత్రం మర్చిపోరని.. చెన్నైలో ఉంటున్న అతని పాఠశాల స్నేహితుడు నర్సారెడ్డి తెలిపారు. నవంబర్​ 6న ఒంగోలు నుంచి చెన్నై వెళ్లిన వెంకయ్యనాయుడు.. ఈరోజు ఉదయం నగరంలోని చెట్‌పేట్‌లోని పాఠశాల స్నేహితుడు అయిన నర్సారెడ్డి నివాసానికి వెళ్లి.. అతనితో గంటసేపు మాట్లాడారు. ఆ సమయంలోనే ఆయన గురించి పలు ఆసక్తికర విషయాలు నర్సారెడ్డి ఈటీవీ భారత్​తో పంచుకున్నారు.

చెన్నైలో చిన్ననాటి స్నేహితుడు నర్సారెడ్డి ఇంటికి వెళ్లిన మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు

"వెంకయ్యనాయుడికి, నాకు పాఠశాల స్థాయి నుంచి స్నేహం ఉంది. ఏ పదవిలో ఉన్నా తన స్నేహితులను మాత్రం మర్చిపోలేదు. ఈరోజు మా ఇంటికి రావడం చాలా ఆనందంగా ఉంది. వెంకయ్యనాయుడికి ఒక ప్రత్యేకమైన అలవాటు ఉంది. ప్రతి సంక్రాంతికి తన చిన్ననాటి స్నేహితులందరినీ పిలిచి.. స్వర్ణభారతిలో విందు ఏర్పాటు చేస్తారు. స్నేహం అంటే వెంకయ్యనాయుడు.. వెంకయ్యనాయుడు అంటే స్నేహం" -నర్సారెడ్డి, వెంకయ్యనాయుడి చిన్ననాటి స్నేహితుడు

ఇవీ చదవండి:

Last Updated :Nov 8, 2022, 5:57 PM IST

ABOUT THE AUTHOR

...view details