ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Couple suicide: దంపతుల ఆత్మహత్య... ఎక్కడంటే..?

By

Published : Oct 17, 2022, 12:26 PM IST

Couple suicide:కృష్ణా జిల్లా గన్నవరం మండలం ముస్తాబాదలో విషాదం చోటు చేసుకుంది. ఆర్థిక ఇబ్బందులతో దంపతులు ఆత్మహత్య పాల్పడ్డారు. అసలేం జరిగిందంటే..?

suicide
దంపతుల ఆత్మహత్య

Couple suicide: కృష్ణా జిల్లా గన్నవరం మండలం ముస్తాబాదలో దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. దంపతులు స్థానిక పేడ చెరువులో దూకి ఆత్మహత్యకు చేసుకున్నారు. బాధితులు పెండెం విజయ్ కుమార్, అతడి భార్యగా పోలీసులు గుర్తించారు. ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య సమస్యల కారణంగా ఆత్మహత్యకు పాల్పడినట్లు స్థానికులు చెబుతున్నారు. స్థానికులు కాపాడేందుకు యత్నించినా.. అప్పటికే దంపతులు మృతిచెందారు. మృతులకు డిగ్రీ చదువుతున్న ఇద్దరు కుమారులు ఉన్నారని తెలిపారు. సమాచారం అందుకున్న గన్నవరం పోలీసులు.. ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

ABOUT THE AUTHOR

...view details