ఆంధ్రప్రదేశ్

andhra pradesh

TOP NEWS: ఏపీ ప్రధాన వార్తలు @ 9 PM

By

Published : Oct 23, 2022, 8:59 PM IST

ఏపీ ప్రధాన వార్తలు

AP Top News
ఏపీ ప్రధాన వార్తలు

  • కొత్తపల్లిలో అంతుచిక్కని సమస్య.. ఏడుగురు విద్యార్థినులకు అస్వస్థత
    Seven girls ill at school: ఆ పాఠశాలలో ఏడుగురు బాలికలు అస్వస్థతకు గురయ్యారు. ఒక్కసారిగా కుప్పకూలి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడ్డారు. అస్వస్థతకు గురైన బాలికలను పీహెచ్‌సీకి తరలించారు. ఆస్పత్రిలో ఆక్సిజన్‌ సౌకర్యం కేవలం ఒకరికే ఉండటంతో శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిపడుతున్న నలుగురు బాలికలను.. రెండు అంబులెన్సుల్లో కాకినాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఘటనకు సంబంధిచిన అంశాన్ని గోప్యంగా ఉంచిన టీచర్లపై చర్యలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • కొవిడ్ పరిహారం పేరుతో మోసం.. కోట్లు కొల్లగొడుతున్న అంతర్జాతీయ ముఠా
    International gang frauds: కొవిడ్ మృతులకు పరిహారం పేరుతో మోసాలకు పాల్పడుతున్న అంతర్జాతీయ ముఠాను కడప పోలీసులు అరెస్టు చేశారు. ఈ ముఠా సభ్యులు దిల్లీ కేంద్రంగా కాల్ సెంటర్ ఏర్పాటు చేసి అమాయకులను నమ్మించి మోసం చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. అపరిచిత వ్యక్తుల ఫోన్ కాల్స్​లో వాట్సాప్​లో వచ్చే లింక్​ల​ను చూసి మోసపోవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • 'పాదయాత్రకు వస్తున్న స్పందన చూసి ఓర్వలేకపోతున్నారు'
    Amaravati JAC leaders on padayatra: పాదయాత్రకు ప్రజల నుంచి వస్తున్న స్పందన చూసి వైకాపా నాయకులు ఓర్వలేక పోతున్నారని అమరావతి జేఏసీ నాయకులు అన్నారు. కోర్టు తీర్పును పోలీసులు తమకు ఇష్టం వచ్చినట్లుగా మలుచుకొని రైతుల పట్ల దారుణంగా ప్రవర్తిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీపావళి అనంతరం హైకోర్టును ఆశ్రయించి పాదయాత్రను తిరిగి ప్రారంభిస్తామని తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • కాగ్​కు లెక్కలు ఎందుకు చెప్పటం లేదు: యనమల రామకృష్ణుడు
    Yanamala Rama Krishnudu : ముఖ్యమంత్రి జగన్మోహన్​ రెడ్డి అప్పులపై అనుసరిస్తున్న విధానంపై తెదేపా నేత యనమల రామకృష్ణుడు స్పందించారు. తెచ్చిన అప్పులు స్వార్థానికి వినియోగిస్తున్నారు తప్ప.. అభివృద్ధికి వినియోగించటం లేదని విమర్శించారు. కాగ్​కు లెక్కలు తెలపకపోవటానికి గల కారణం ఏంటని ప్రశ్నించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • రహస్య నివేదిక లీక్​ కావడంపై చర్యలు తీసుకోవాలి: నాదెండ్ల మనోహర్​
    Janasena leaders comments on YSRCP: రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య తలెత్తేలా చేయడమే వైకాపా లక్ష్యమని జనసేన నేతలంటున్నారు. వైకాపా నాయకులపై జనసేన నేతలు దాడి చేస్తారని జరుగుతున్న ప్రచారాన్ని జనసేన రాజకీయ వ్యవహరాల కమిటీ ఛైర్మన్​ నాదెండ్ల మనోహర్​ ఖండించారు. జనసేన ఎటువంటి దాడులకు దిగకుండా కేవలం ప్రజస్వామ్యబద్దంగా నడుచుకుంటుందని అన్నారు. రాష్ట్రంలో అరాచకాలు సృష్టించాలని వైకాపా ప్రభుత్వం చూస్తోందని జనసేన నేత పోతిన వెంకట మహేశ్​ అన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • 'సబ్‌ కా సాథ్‌.. సబ్‌ కా వికాస్‌'కు ప్రేరణ శ్రీరాముడే'.. అయోధ్యలో ఘనంగా దీపోత్సవం
    శ్రీరామచంద్రుడి మాటలు, ఆలోచనలు, పరిపాలన విలువలే 'సబ్‌ కా సాథ్‌.. సబ్‌ కా వికాస్‌'కు ప్రేరణ అని ప్రధాని మోదీ అన్నారు. అయోధ్యలో అంగరంగ వైభవంగా జరుగుతున్న దీపోత్సవంలో ప్రధాని పాల్గొన్నారు. ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ జరుగుతున్న వేళ.. శ్రీరాముడి సంకల్పాన్ని తీసుకొని దేశాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్లాలని మోదీ సూచించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • సోనియా గాంధీకి షాక్​.. రెండు ఎన్​జీఓల లైసెన్స్ రద్దు
    కాంగ్రెస్ నాయకురాలు సోనియా గాంధీకి చెందిన రెండు ఎన్​జీఓలకు కేంద్రం షాక్ ఇచ్చింది. విదేశీ విరాళాల సేకరణలో అవకతవకలు జరిగాయంటూ ఆ రెండు ఎన్​జీల ఎఫ్​సీఆర్​ఏను కేంద్ర హోం శాఖ రద్దు చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • 'ప్రధాని పదవికి పోటీ చేస్తున్నా'.. అధికారికంగా ప్రకటించిన రిషి సునాక్​
    బ్రిటన్​ ప్రధానమంత్రి పదవికి పోటీ చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు భారత సంతతికి చెందిన రిషి సునాక్​. ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న బ్రిటన్‌ను చక్కదిద్ది.. దేశం కోసం పాటుపడాలని చూస్తున్నట్లు తెలిపారు.పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • 'కింగ్' కోహ్లీ సూపర్ ఇన్నింగ్స్.. ఉత్కంఠ పోరులో భారత్​ విజయం
    India vs Pakistan : ఉత్కంఠ భరితమైపోరులో భారత్​ విజయం సాధించింది. పాకిస్థాన్​పై 4 వికెట్ల తేడాతో గెలిచింది. కింగ్ కోహ్లీ, హార్దిక్​ పాండ్య అద్భత చిరస్మరణీయ ఇన్నింగ్స్ ఆడారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • భారీ యాక్షన్​ సన్నివేశాలతో 'మెగా 154'
    Mega 154 : మెగాస్టార్​ అప్​కమింగ్​ మూవీకి సంబంధించిన ఓ తాజా అప్డేట్​ నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. మాస్​ లుక్​తో ఇప్పటికే ఓ పోస్టర్​ విడుదలవ్వగా.. సినిమాలో భారీ యాక్షన్ సీన్స్ ఉంటాయని తెలుస్తోంది.పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ABOUT THE AUTHOR

...view details