ఆంధ్రప్రదేశ్

andhra pradesh

దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ మండలి సమావేశంలో ఏపీకి మళ్లీ నిరాశే

By

Published : Sep 4, 2022, 11:28 AM IST

దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ మండలి సమావేశంలో ఏపీకి మళ్లీ నిరాశే ఎదురైంది. విభజన చట్టం 9, 10 షెడ్యూళ్లలోని అంశాలపై చర్చ జరిగినా వేటికీ పరిష్కారం దొరకలేదు. తెలుగు రాష్ట్రాలు విభజన సమస్యల్ని సామరస్యంగా పరిష్కరించుకోవాలని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా ఉచిత సలహా ఇచ్చారు.

SSRC Meetings
SSRC Meetings

దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ మండలి సమావేశంలో ఏపీకి మళ్లీ నిరాశే ఎదురైంది. విభజన చట్టం 9, 10 షెడ్యూళ్లలోని అంశాలపై చర్చ జరిగినా వేటికీ పరిష్కారం దొరకలేదు. తెలుగు రాష్ట్రాలు విభజన సమస్యల్ని సామరస్యంగా పరిష్కరించుకోవాలని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా ఉచిత సలహా ఇచ్చారు. ఐతే, ఏపీకి విద్యుత్‌ బకాయిల్ని చెల్లించి తీరాల్సిందేనని తెలంగాణకు నొక్కిచెప్పడమే రాష్ట్రానికి కొంత సానుకూలంగా కనిపిస్తోంది. రూ.6,756 కోట్ల బకాయిల్ని నెల రోజుల్లో చెల్లించాలని కేంద్ర ఇంధన మంత్రిత్వశాఖ ఇచ్చిన ఆదేశాలపై సమావేశంలో తెలంగాణ ప్రతినిధులు అభ్యంతరం తెలుపింది. ఇరు రాష్ట్రాల మధ్య కుదిరిన PPAపై కేంద్రం ఆదేశాలు ఎలా ఇస్తుందని తెలంగాణ ప్రతినిధులు ప్రశ్నించగా.. అమిత్‌ షా మాత్రం బకాయిలుచెల్లించాల్సిందేనని స్పష్టం చేసినట్టు సమాచారం. ఇక విద్యుత్‌ బకాయిల అంశాన్ని ఎజెండా నుంచి తొలగిద్దామని కేంద్ర అధికారులు ప్రతిపాదించగా, చెల్లింపులు పూర్తయ్యేవరకు ఉంచాలని అమిత్‌ షా స్పష్టం చేసినట్టు తెలిసింది.

ఇదేసమయంలో దిల్లీలోని ఏపీ భవన్‌ విభజన ప్రక్రియను ఏపీ ప్రభుత్వంతో సామరస్యంగా పరిష్కరించుకుంటామని తెలంగాణ ప్రభుత్వం పేర్కొంది. గత ప్రాంతీయ మండలి సమావేశానికి హాజరైన సీఎం రాష్ట్రానికి ప్రత్యేక హోదా గురించి ప్రస్తావించగా ఈసారి హాజరైన ఆర్థిక మంత్రి బుగ్గన ఆ ఊసే ఎత్తలేదు. విభజన చట్ట ప్రకారం రాయలసీమ కరవు నివారణ, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకాలకు కేంద్రం ఆర్థిక సాయం చేయాలని బుగ్గన కోరారు. ‘ఉత్తరాంధ్రలోని 3, రాయలసీమలోని 4 జిల్లాలకు బుందేల్‌ఖండ్‌ తరహాలో ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజి ఇవ్వాల్సి ఉందని బుగ్గన పేర్కొన్నారు. ప్రత్యేక హోదా రాష్ట్రాలకు ఇచ్చినట్లే, పరిశ్రమల ఏర్పాటుకు ప్రత్యేక రాయితీలు కొనసాగించాలని,.. దక్షిణ కోస్తా రైల్వే జోన్‌ త్వరగా ఏర్పాటయ్యేలా చూడాలని బుగ్గనకోరారు.

ఇవి చదవండి:

ABOUT THE AUTHOR

...view details