ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ప్రభుత్వ బాలికల పాఠశాలలో నాగుపాము.. పట్టుకున్న స్నేక్ క్యాచర్

By

Published : Jan 3, 2023, 9:46 PM IST

Snake Entered In To School: పాఠశాల పరిసర ప్రాంతాల్లో పిచ్చి మొక్కలు, చెత్తాచెదారం ఉండడంతో తరచుగా పాములతో పాటు తేళ్లు, జెర్రీలు కూడా తరగతి గదిలో కనిపిస్తున్నాయని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కోనసీమ జిల్లా ముమ్మిడివరం ప్రభుత్వ బాలికల పాఠశాలలో నాగుపాము కనిపించడంతో విద్యార్థినిలు భయభ్రాంతులకు గురయ్యారు.

Etv Bharat
Etv Bharat

Snake Entered In To School: అంబేడ్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం ప్రభుత్వ బాలికల పాఠశాలలో నాగుపాము ప్రవేశించింది. పామును చూసి విద్యార్థినిలు భయాందోళనకు గురయ్యారు. పాఠశాల పరిసర ప్రాంతాల్లో పిచ్చి మొక్కలు, చెత్తాచెదారం ఉండడంతో తరచుగా పాములతో పాటు తేళ్లు, జెర్రీలాంటివి తరగతి గదిలో కనిపిస్తున్నాయని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పామును గుర్తించిన వెంటనే స్థానికంగా ఉండే స్నేక్ క్యాచర్ వర్మకు సమాచారం ఇచ్చారు. అతను వచ్చి పామును చాకచక్యంగా పట్టుకోవడం విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు ఊపిరి పీల్చుకున్నారు.

ప్రభుత్వ బాలికల పాఠశాలలో నాగుపాము హల్ చల్..రంగంలోకి స్నేక్ క్యాచర్

ABOUT THE AUTHOR

...view details