ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Cyclone Effect: నేలవాలిన పంటలు... తడిసిముద్దయిన ధాన్యం

By

Published : May 11, 2022, 9:59 AM IST

Updated : May 11, 2022, 10:14 PM IST

Cyclone effect on crop: అసని తుపాను ప్రభావం రైతులను తీవ్రంగా నష్టపరుస్తోంది. తుపాను కారణంగా రెండ్రోజులుగా కురుస్తున్న వర్షాలకు పంటలు నీట మునిగాయి. పలుచోట్లు కోతలు కోసిన ధాన్యం తడిచిపోయింది. ఈదురుగాలులకు వరి చేలు నేలవాలాయి. మామిడికాయలు నేల రాలాయి. కోనసీమ, తిరుపతి, ప్రకాశం జిల్లాలో ధాన్యం తడిసి.. మొలకలు వస్తాయని రైతులు ఆందోళన చెందుతున్నారు.

Cyclone effect on crop
నేలవాలిన పంటలు

Cyclone effect on crop: తుపాను ప్రభావంతో కోనసీమ జిల్లాలో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలో లక్షా 91 వేల ఎకరాల్లో రైతులు రబీ వరి సాగు చేశారు. ఇప్పటివరకు 82 వేల ఎకరాల్లో మాత్రమే వరి కోతలు పూర్తయ్యాయి. కోతలు పూర్తయిన పంటలకు సంబంధించి 40 శాతానికిపైగా ధాన్యం తుపాను కారణంగా రాశుల్లోనే ఉండిపోయింది. ఈదురుగాలులతో వరిచేలు నేల వాలాయి. వాతావరణం ఇలాగే ఉంటే ధాన్యం మొలకలు వస్తాయని రైతులు ఆందోళన చెందుతున్నారు.

నేలవాలిన పంటలు

Cyclone effect on crop: తిరుపతి జిల్లా నాయుడుపేట పరిసరాల్లో రెండ్రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు కూరగాయలు, ఉద్యానవన పంటలు దెబ్బతింటున్నాయి. వర్షంతో పాటు ఈదురుగాలులు వీస్తుండటంతో చెట్లు నేలకూలాయి. పంటలు దెబ్బతిన్నాయి. పంటలకు వేసిన షెడ్డులు పడిపోయాయి. పందిళ్లు నేలవాలాయి. ఇటుకల వ్యాపారులు తీవ్రంగా నష్టపోయారు.

కృష్ణాజిల్లాదివిసీమలో అసని తుపాను ప్రభావంతో భారీగా వీస్తున్నాయి. మోపిదేవి, చల్లపల్లి, మండలాల్లో అరటి తోటలు, మునగ తోటలు, బొప్పాయి తోటలు నేలకొరిగాయి. మామిడి కాయలు రాలిపోవడంతో మామిడి రైతులు తీవ్రంగా నష్టపోయారు. భారీ గాలులకు రోడ్లపై తాడి చెట్లు, వృక్షాలు విరిగి పడ్డాయి. వర్షం తక్కువగా ఉన్నప్పటికీ గాలుల ప్రభావంతో రైతులకు నష్టం వాటిల్లింది.

ప్రకాశం జిల్లా చీరాల మండలంలో వేరుశెనగ పంట నీటమునిగింది. రొయ్యల చెరువులు కాపాడుకునేందుకు రైతులు ఇబ్బందులు పడుతున్నారు.

ఇవీ చదవండి:

Last Updated :May 11, 2022, 10:14 PM IST

ABOUT THE AUTHOR

...view details