కుప్పంలో చంద్రబాబు.. శ్రేణుల ఘనస్వాగతం
Updated on: May 11, 2022, 6:31 PM IST

కుప్పంలో చంద్రబాబు.. శ్రేణుల ఘనస్వాగతం
Updated on: May 11, 2022, 6:31 PM IST
CBN TOUR: సొంత నియోజకవర్గం కుప్పంలో పర్యటిస్తున్న తెదేపా అధినేత చంద్రబాబుకు పార్టీ శ్రేణులు ఘనస్వాగతం పలికాయి. నేటి నుంచి మూడ్రోజుల పాటు ఆయన కుప్పులో పర్యటించనున్నారు.
CBN TOUR: మూడ్రోజుల పర్యటన నిమిత్తం తెదేపా అధినేత చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పం చేరుకున్నారు. బెంగళూరు విమానాశ్రయం నంచి రోడ్డు మార్గంలో చంద్రబాబు కుప్పం చేరుకున్నారు. ఈ సందర్భంగా ఏపీ సరిహద్దుల్లో తెదేపా శ్రేణులు ఆయనకు ఘన స్వాగతం పలికాయి. చంద్రబాబు రాకతో కుప్పం పరిసరాలు పసుపు జెండాలతో నిండిపోయాయి. ముందుగా బెళ్లకోగిలో అరటిపంటను చంద్రబాబు పరిశీలించారు. అక్కడి నుంచి పాదయాత్రగా బయల్దేరిన చంద్రబాబు..స్థానికులు, రైతులతో మాట్లాడి సమస్యలు తెలుసుకుంటున్నారు.
నియోజకవర్గంలోని శాంతిపురం, గుడిపల్లె మండలాల్లో పర్యటించి.. బోయనపల్లిలో 'బాదుడే బాదుడు' కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొననున్నారు. రేపు సీగలాపల్లిలో జరగబోయే జాతరలో ఆయన పాల్గొంటారు. ఎల్లుండి కుప్పంలో పార్టీ నేతలు, కార్యకర్తలతో భేటీ అయ్యి.. పార్టీ కమిటీలు, అనుబంధ విభాగాలపై సమీక్ష నిర్వహించనున్నారు.
ఇవీ చదవండి:
