ఆంధ్రప్రదేశ్

andhra pradesh

బకాయిలు చెల్లించాలని.. సచివాలయ గేటుకు తాళం వేసి

By

Published : Nov 23, 2022, 6:18 PM IST

Contractors Protest: ఇటీవల వరద సమయంలో బాధితులకు ఆహారం ఏర్పాటు చేసిన గుత్తేదారులు ఆందోళన చేశారు. అంబేడ్కర్ కోనసీమ జిల్లా మామిడికుదురు మండలంలో పాశర్లపూడి సచివాలయ గేటుకు తాళం వేసి.. సిబ్బంది విధులకు వెళ్లకుండా అడ్డుకున్నారు.

LOCk
LOCK

Contractors Protest for Pending Bills: కోనసీమ జిల్లా మామిడికుదురు మండలంలో ఇటీవల వరదల సమయంలో బాధితులకు ఆహారం ఏర్పాటు చేసిన కాంట్రాక్టర్లు ఆందోళన చేపట్టారు. పాశర్లపూడి బాడవ సచివాలయానికి గేటు వేసి విధులకు వెళ్లకుండా సచివాలయ సిబ్బందిని అడ్డుకున్నారు. స్థానిక తహసీల్దార్, కార్యదర్శుల ఆదేశాల మేరకు వరద ముంపు గ్రామాల ప్రజలకు ఆహారం అందించిన ఇద్దరు గుత్తేదారులకు... సుమారు 4లక్షలు రూపాయల బకాయిలు చెల్లించాలి. గత రెండేళ్లుగా కార్యాలయాల చుట్టూ తిప్పించుకుని బకాయిలు చెల్లించకపోవడంపై బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారుల ఫిర్యాదు మేరకు నిరసనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు

బకాయిలు చెల్లించాలని గుత్తేదారుల నిరసన

ABOUT THE AUTHOR

...view details