ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Telangana Debts : తెలంగాణ అప్పులు.. రూ.4.86 లక్షల కోట్లు

By

Published : Feb 7, 2023, 11:19 AM IST

Updated : Feb 7, 2023, 11:27 AM IST

Telangana Debts 2023-24 : వచ్చే ఏడాది తీసుకునే కొత్త రుణాలతో కలిసి తెలంగాణ సర్కార్ అప్పులు మొత్తం రూ.4,86,302.61 కోట్లకు చేరతాయని బడ్జెట్‌లో ప్రభుత్వం వెల్లడించింది. ఇవి (2022-23)లో రూ.3,22,993 కోట్లుంటే 2023-24లో రూ.35 వేల కోట్లు అదనంగా పెరిగి రూ.3,57,059 కోట్లకు చేరనున్నాయి.

Telangana Debts
తెలంగాణ అప్పులు

Telangana Debts 2023-24 : తెలంగాణ ప్రభుత్వం వచ్చే ఏడాది తీసుకునే కొత్త రుణాలతో కలిపి మొత్తం అప్పులు రూ.4,86,302.61 కోట్లకు చేరతాయని బడ్జెట్‌లో వెల్లడించింది. ‘ద్రవ్య బాధ్యత బడ్జెట్‌ నిర్వహణ’(ఎఫ్‌ఆర్‌బీఎం) పరిధిలో రాష్ట్ర ప్రభుత్వం నేరుగా తీసుకున్న రుణాలను బడ్జెట్‌లో చూపుతుంది. ఇవి (2022-23)లో రూ.3,22,993 కోట్లుంటే 2023-24లో రూ.35 వేల కోట్లు అదనంగా పెరిగి రూ.3,57,059 కోట్లకు చేరనున్నాయి. ఇవి కాక వివిధ ప్రభుత్వ రంగ సంస్థలు తీసుకున్న రుణాలకు పూచీకత్తు ఇచ్చినవి బడ్జెట్‌ వెలుపల అదనంగా ఉంటాయి. వాటితో కలిపితే మొత్తం రూ.4.86 లక్షల కోట్లకు చేరతాయి.

Telangana Debts 2024 : వచ్చే ఏడాదిలో రాష్ట్ర జనాభా 4 కోట్లు ఉంటుందనే అంచనాతో లెక్కిస్తే...ఒక్కొక్కరిపై తలసరి రుణభారం రూ.1,21,575 ఉంటుందని అనధికార అంచనా. 2020-21లో రాష్ట్ర స్థూల ఉత్పత్తి విలువ(జీఎస్‌డీపీ)లో అప్పులు 25.4 శాతం కాగా వచ్చే ఏడాదికి 23.8 శాతానికి తగ్గుతుందని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.

Telangana Debts 2024 updates : కానీ ఈ శాతం తగ్గినట్లు చూపినా ఎఫ్‌ఆర్‌బీఎం పరిధిలో తీసుకున్న అప్పుల సొమ్ము మాత్రం 2020-24 మధ్య నాలుగేళ్లలో రూ.2,44,019 కోట్ల నుంచి రూ.3,57,059 కోట్లకు పెరుగుతోంది. జీఎస్‌డీపీ విలువ పెరిగినందునే అప్పుల శాతం తగ్గినట్లు కనిపిస్తోంది తప్ప తీసుకున్న అప్పులు మాత్రం నాలుగేళ్ల వ్యవధిలో రూ.2.44 లక్షల కోట్ల నుంచి రూ.3.57 లక్షల కోట్లకు చేరాయి.

ఇవి కాకుండా రాష్ట్ర ప్రభుత్వ పూచీకత్తుతో ప్రభుత్వ రంగ సంస్థలు తీసుకున్న రుణాల్లో కాళేశ్వరం ప్రాజెక్టు సంస్థవి రూ.66,854 కోట్లు, మిషన్‌ భగీరథకు రూ.23,364.38 కోట్లు, రాష్ట్ర గృహనిర్మాణ సంస్థవి రూ.7,435.89 కోట్లు, విద్యుత్‌ పంపిణీ సంస్థ(డిస్కం)లవి రూ.6,300 కోట్లు, విద్యుత్‌ ఆర్థిక సంస్థవి రూ.2,917 కోట్లు... ఇలా వివిధ సంస్థలవి ఉన్నాయి. వివిధ రకాల అభివృద్ధి పథకాలకు రాష్ట్ర ప్రభుత్వం ఈ సంస్థల ద్వారా రుణాలను తీసుకుంటోంది. వీటిలో కొన్ని సంస్థలు వాటికి వచ్చే ఆదాయంతోనే తిరిగి అప్పులు చెల్లించాలి. ఉదాహరణకు కరెంటు బిల్లుల ద్వారా వచ్చే ఆదాయంతో డిస్కంలు అప్పులను తిరిగి చెల్లిస్తాయి.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2022-23) రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్‌డీపీ)ని ప్రసుత్త ధరల్లో రూ.13,27,495 కోట్లుగా ప్రభుత్వం అంచనా వేసింది. గత ఏడాది కంటే 15.6 శాతం వృద్ధిరేటును రాష్ట్రం సాధించింది.

రాష్ట్ర ప్రభుత్వం నేరుగా తీసుకున్న రుణాలు

గమనిక : ఇవి కాక ప్రభుత్వం పూచీకత్తు ఇవ్వడంతో ప్రభుత్వ రంగ సంస్థలు తీసుకున్న రుణాలు మరో రూ.1,29,243.61 కోట్లు ఉన్నాయి. వీటితో కలిపితే మొత్తం రుణాలు వచ్చే ఏడాది రూ.4,86,302.61 కోట్లకు చేరనున్నాయి.

ఇవీ చదవండి :

Last Updated :Feb 7, 2023, 11:27 AM IST

ABOUT THE AUTHOR

...view details